అన్వేషించండి

Karimnagar Mayor Seat: కరీంనగర్‌ మేయం పీఠంపై వీడని సస్పెన్స్! తగ్గేదేలే అంటున్న బీజేపీ, కాంగ్రెస్

Karimnagar Mayor Election | కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తామే దక్కించుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు. మేయర్ పీఠం తమదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.

వేములవాడ: కరీంనగర్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కరీంనగర్ మేయం పదవిని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా దక్కించుకుంటుందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. వేములవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, కరీంనగర్ మేయర్ ఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో పూర్తి మెజార్టీ లేకనే బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ మేయర్ పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. మరి కరీంనగర్‌లో మెజార్టీ లేకపోయినా బీజేపీ మేయర్ పీఠం దక్కించుకుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

కార్పొరేషన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్ ఎన్నిక జరుగుతుందని, అందరినీ కలుపుకొని పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిజెపి ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో, తాము కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో సహజంగానే క్యాంపు రాజకీయాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నగరాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.

కరీంనగర్ కార్పొరేషన్‌లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ !
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులను బీజేపీ వైపు తిప్పుకోవడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్‌‌లో మొత్తం 66 డివిజన్లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (34) కోసం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కీలకంగా మారింది. 
బీజేపీకి మద్దతు తెలిపిన నలుగురు ఇండిపెండెంట్లు..
కరీంనగర్ లో గెలిచిన నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కమలం గూటికి చేరడంతో బీజేపీ బలం 34కు పెరిగింది. ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్ స్వయంగా వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులు బీజేపీలో చేరగా, తాజాగా మరో ఇద్దరు (వి. కవిత, ఎం. గణేష్) పార్టీలో చేరారు. దీంతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావాల్సిన సంఖ్యాబలం బీజేపీకి లభించింది. దాంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని తేలిపోయింది. సోమవారం జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget