Queen Title Glimpse : 'క్వీన్'గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామిని - డిఫరెంట్ లవ్ స్టోరీతో క్యూరియాసిటీ పెంచేసిన టైటిల్ గ్లింప్స్
Queen Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామిని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'క్వీన్' మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.

Yamini ER Debut Movie Queen Titile Glimpse Out : మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రతన్ రిషి... ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. ఆయన గతంలో రూపొందించిన ఉత్తర, ఆర్టిస్ట్ మూవీస్ మంచి గుర్తింపు తెచ్చాయి.
ఫీమేల్ ఓరియెంటెడ్ 'క్వీన్'
ప్రస్తుతం తన మూడో చిత్రంగా యామినీ ఈఆర్‍తో హీరోయిన్ సెంట్రిక్ కథతో 'క్వీన్' సినిమాను తెరకెక్కిస్తున్నారు రతన్ రిషి. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తుండగా... కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం 90's హీరోల్లో ఒకరిని సంప్రదిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ గ్లింప్స్
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సొసైటీతో ముడి పడి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీనే చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. 'రాళ్ల మీద పేర్లతో కొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. తాజ్ మహల్ మీద గుర్తులుగా మరికొన్ని ప్రేమ కథలు మిగిలిపోతాయి. కానీ దేశపు మనుగడను మార్చే కొత్త శాసనంగా ఈ ప్రేమ కథ' అని చెబుతూ.. భారత రాజ్యాంగం, ఆర్టీఐ యాక్ట్, పీపుల్ సెంట్రిక్ గవర్నమెంట్ సిస్టమ్, యాక్ట్ ఆఫ్ లవ్ వంటివి చూపించడం మూవీపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ... అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో స్ఫూర్తి కలిగించేలా చూపించనున్నారు దర్శకుడు రతన్ రిషి. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే మిగిలిన వివరాలు వెల్లడి కానున్నాయి.
'క్వీన్' నటీనటులు - యామినీ ఈఆర్, కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్, భాయ్ నవీన్, తదితరులు.
టెక్నికల్ టీమ్ - ఆర్ట్ - భార్గవ నౌండ్ల, కొరియోగ్రఫీ - జేడీ మాస్టర్, డీవోపీ - సరస్, మ్యూజిక్ - యతీష్, ఎడిటింగ్ - ఆర్ ఎం విశ్వనాథ్, చనాపల్లి
నిర్మాణం - వన్ సర్కిల్, రచన, దర్శకత్వం - రతన్ రిషి
























