Salman Agha Comments on Abhishek Sharma India vs Pakistan | అభిషేక్ పై పాకిస్తాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీ20 వరల్డ్ కప్ 2026లో ( T20 World Cup 2026 ) తొలి 2 మ్యాచులు స్వదేశంలో ఆడిన టీమిండియా నెక్ట్స్ మ్యాచ్ శ్రీలంకలో ఆడుతుంది. అయితే టీమిండియాతో కీలక మ్యాచ్ గురించి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ( Salman Ali Agha ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) బరిలోకి దిగాలని తాను కోరుకుంటున్నానని, అత్యుత్తమ జట్టుతో తాము పోటీ పడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
"భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుంటున్నాడని విన్నాం. పాక్‌తో జరిగే మ్యాచ్ ఆడతాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మేం బెస్ట్ టీంతో పోటీ పడి నెగ్గాలి అనుకుంటున్నాం" అని సల్మాన్ ఆగా అన్నాడు. యుఎస్ఏతో మ్యాచ్‌కు ముందే అభిషేక్ శర్మ అస్వస్థతకు గురయ్యాడు. కానీ ఆ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఆసుపత్రిలో 2 రోజులు చికిత్స తీసుకున్నాడు. అయితే నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు ముందు అతను జట్టుతో తిరిగి కలిశాడు. కానీ మ్యాచ్ ఆడలేదు.
దాంతో సంజూ శాంసన్ ( Sanju Samson ) ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. దీనిపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా మాట్లాడుతూ, అభిషేక్‌ను మైదానంలో చూడాలనుకుంటున్నాను. మరి ఈ మ్యాచ్ లో అభిషేక్ ఆడతాడా లేదా అన్నది చూడాలి.























