By: ABP Desam | Updated at : 15 Feb 2022 09:56 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఐఎస్ఎఫ్ ఉద్యోగాల నోటిఫికేషన్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుదారులు(పురుషులు) CISF అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ www.cisfrectt.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సీఐఎస్ఎఫ్ లో మొత్తం 1149 ఖాళీలను భర్తీ చేస్తుంది. మార్చి 4, 2022 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
అభ్యర్థులు సైన్స్ సబ్జెక్ట్‌తో గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుంచి క్లాస్ 12 లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
మార్చి 4, 2022 నాటికి అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయో పరిమితి 23 సంవత్సరాలు.
పే లెవల్-3: రూ. 21,700-69,100
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష (RME) అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), OMR/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) కింద రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)/ డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME), రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉద్యోగాల భర్తీకి ఇటీవల జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. దీంతో మొత్తం 249 హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఖాళీల సంఖ్య వివరాల కోసం అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ వెబ్‌సైట్ https://cisfrectt.in/ ఉంచింది. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో వెల్లడించిన క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 3,2022 చివరి తేదీ. సీఐఎస్ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, క్రీడార్హతలు స్పష్టంగా తెలుసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తుల్ని పోస్టులో నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపించాలి.
జనరల్ డ్యూటీలోని మొత్తం 249 ఖాళీల్లో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) మేల్- 181, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఫీమేల్- 68 పోస్టులున్నాయి. ఇంటర్ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయో పరిమితి 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు చెల్లించక్కర్లేదు.
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్న్యూస్
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Amalapuram Protests: అమలాపురం విధ్వంసంపై పోలీసులు విశ్లేషణ- కారుకులను గుర్తించే పనిలో ఖాకీలు
Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’
Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?