BSF Recruitment: కేంద్రం గుడ్ న్యూస్, బీఎస్‌ఎఫ్‌లో 'అగ్నివీరులకు' 10 శాతం రిజర్వేషన్!
అగ్నివీరులుగా పనిచేసి రిటైర్ అయిన వారు బీఎస్‌ఎఫ్‌లో చేరాలనుకుంటే ఉద్యోగ ఖాళీల్లో 10 శాతం మేర ఉద్యోగాలు వీరికోసం రిజర్వు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా గెజిట్ జారీ చేసింది.
త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీరుల నియామకానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అగ్నివీరులుగా పనిచేసి రిటైర్ అయిన వారు బీఎస్‌ఎఫ్‌లో చేరాలనుకుంటే ఉద్యోగ ఖాళీల్లో 10 శాతం మేర ఉద్యోగాలు వీరికోసం రిజర్వు చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నుంచి మినహాయింపు..
అలాగే, బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలను భర్తీ చేసే సమయంలో వీరికి దేహదారుఢ్య పరీక్ష(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్) నుంచి మినహాయింపు కల్పించనున్నట్టు తెలిపింది. అలాగే, తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్లు వయో సడలింపు, ఆ తర్వాత బ్యాచ్‌ల వారికి మూడేళ్ల పాటు సడలింపు ఇవ్వనున్నట్టు పేర్కొంది. సైన్యంలో అగ్నివీరులుగా సేవలందించిన వారికి కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు గతేడాది కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
Central govt has declared 10% reservation for ex-Agniveers in vacancies within BSF as well as relaxed upper age-limit norms depending on whether they are part of the first batch or subsequent batches. MHA made the announcement through a notification dated 6th March pic.twitter.com/dn100tXQ7j
— ANI (@ANI) March 10, 2023
'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు..
కేంద్ర ప్రభుత్వం కొత్త తీసుకొచ్చిన 'అగ్నిపథ్' స్కీమ్ కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ.. ఇండియన్ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో చేరాలనుకునే వారికి మొదట ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్(సీఈఈ) నిర్వహించనుంది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆగ్నివీరుల ఎంపికలో తొలుత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీటిలో అర్హత సాధించిన వారు సీఈఈకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇకపై తొలుత సీఈఈని నిర్వహించనున్నారు. దీనివల్ల రిక్రూట్‌మెంట్‌లో భారీ రద్దీలను తగ్గించేందుకు వీలు పడనుంది. స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి వీలుపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్‌లో తొలి విడత సీఈఈ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023-24 రిక్రూట్‌మెంట్‌లో సైన్యంలో చేరబోయే 40 వేల మందికి ఈ ప్రక్రియ వర్తించనుంది.
మీడియా నివేదికల ప్రకారం అంతకుముందు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉండేది. అభ్యర్థులు మొదట ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టుకి హాజరుకావాలి. తర్వాత మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి. చివరగా అభ్యర్థులు CEEకి అర్హత సాధించాలి. ఇప్పటి వరకు 19000 మంది అగ్నివీరులు సైన్యంలో చేరారు. మార్చి మొదటి వారంలో 21,000 మంది అగ్నివీరులు సైన్యంలో చేరనున్నారు.
రిక్రూట్‌మెంట్ ర్యాలీలలో పాల్గొనే అభ్యర్థుల సంఖ్య చిన్న పట్టణాల్లో 5,000 నుంచి పెద్ద నగరాల్లో 1.5 లక్షల వరకు ఉంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నందున రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మార్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఒక అధికారి ఇలా అన్నారు "మునుపటి ప్రక్రియ ద్వారా ఖర్చు భారీగా అవుతుంది. ఇది పరిపాలనా వనరులపై ఒత్తిడి తెచ్చింది.
Also Read:
Indian Army: ఆర్మీ 'మహిళా అగ్నివీరుల' నియామకాలు, దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?
ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 16 నుంచి అగ్నిపథ్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్మీ 'అగ్నివీరుల' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24 కు సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి అగ్నిపథ్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 తుదిగడువు. అనంతరం ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..