By: ABP Desam | Updated at : 10 Mar 2023 09:59 AM (IST)
Edited By: omeprakash
ఇండియన్ ఆర్మీ - మహిళా అగ్నివీరులు
ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 16 నుంచి అగ్నిపథ్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
వివరాలు..
* ఆర్మీ రిక్రూట్‌మెంట్- అగ్నిపథ్ స్కీమ్
➥ అగ్నివీర్ జనరల్ డ్యూటీ
అర్హత: 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 01.10.2002 - 01.04.2006 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్ల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.03.2023.
➥ ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: 17.04.2023.
Also Read:
ఆర్మీ 'అగ్నివీరుల' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2023-24 కు సంబంధించి ఫిబ్రవరి 16 నుంచి అగ్నిపథ్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 తుదిగడువు. అనంతరం ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బీఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ పోస్టులు - అర్హతలు ఇవే!
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ గ్రూప్- బి(నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు మార్చి 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
గెయిల్ గ్యాస్ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
IBPS PO results: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!
TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్‌టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం