BSF Recruitment: బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎలా అప్లై చేయాలంటే..
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలి.
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన వారు.. బీఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 15న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న దరఖాస్తుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ తేదీల్లోగా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
మొత్తం 2788 పోస్టులకు గానూ ఈ దరఖాస్తులు ఆహ్వానించారు. పురుషులు- 167.5 సెం.మీ, స్త్రీలు- 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ (పురుషులకు మాత్రమే) 78-83 సెం.మీ. గా ఉండాలని.. నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలు / తెగలు / గిరిజనులు పురుషులు-162.5 సెం.మీ మరియు స్త్రీ-155 సెం.మీ. ఎత్తు ఉడే సరిపోతుంది. ఛాతీ (పురుషులకు మాత్రమే) 76-81 సెం.మీ ఉండాలి.
అర్హత, ఆసక్తి కలిగి అప్లై చేసుకోవాలనుకునే.. అభ్యర్థులు.. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ.21,700-రూ.69,100 వేతనం పొందుతారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 15 జనవరి 2022 కాగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28 ఫిబ్రవరి 2022గా ఉంది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 అప్లికేషన్ ఫీజు ఉంది. వెనుకబడిన తరగతులకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: Schools Closed: జనవరి 31 వరకూ పిల్లలకు సెలవులు.. ఇక ఇల్లు పీకి పందిరేస్తారేమో..
Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు
Also Read: Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
Also Read: Telangana Covid Cases: తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదు.. ముగ్గురు మృతి
Also Read: School Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సెలవులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే