Schools Closed: జనవరి 31 వరకూ పిల్లలకు సెలవులు.. ఇక ఇల్లు పీకి పందిరేస్తారేమో..
ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.
కొన్ని రోజులుగా కొవిడ్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో.. పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. మిజోరం ప్రభుత్వం కూడా జనవరి 31 వరకు పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కొవిడ్ 19 మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు కూడా మూసివేయనున్నట్టు ప్రకటించింది.
పాఠశాలల్లోని హాస్టళ్లను కూడా మూసివేస్తామని, ఆన్‌లైన్ మోడ్‌లో తరగతులు నిర్వహిస్తామని మిజోరం ప్రభుత్వం చెప్పింది. అయితే.. ఈ సంవత్సరం బోర్డు పరీక్షకు హాజరయ్యే.. 10 మరియు 12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలు, హాస్టళ్లు తెరిచి ఉంటాయి. అన్ని కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాలలో తరగతులు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతాయని ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది.
శిక్షణా సంస్థలు 50 శాతం సీటింగ్ కెపాసిటీతో తెరిచి ఉంచడానికి అనుమతినిచ్చారు. జనవరి 8 నుంచి జనవరి 31 వరకు అమలులో ఉండే కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రాత్రి సమయంలో చర్చిలలో ఆరాధనలను నిషేధించారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీలో పగటిపూట మాత్రమే అనుమతిస్తారు. సామూహికంగా చేరడంపై నిషేధం విధించారు.
ఐజ్వాల్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC) ప్రాంతంలో పిక్నిక్ స్పాట్‌లు, సినిమా థియేటర్లు, పబ్లిక్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు మరియు బ్యూటీ పార్లర్‌లు మూసివేయనున్నట్టు మార్గదర్శకాల్లో చెప్పారు. జిల్లాల అధికారులు.. దుకాణాలు తెరిచి ఉంచడంపై.. నిబంధనలు పాటించాలని ఆదేశాల్లో ప్రభుత్వం చెప్పింది.
ఐజ్వాల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కొంతమంది మాత్రమే.. కార్యాలయాలకు రావాలని మిగిలిన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. వికలాంగులు, గర్భిణులకు కార్యాలయాలకు హాజరుకాకుండా మినహాయించారు. అయితే ఇంటి నుండి పని చేయాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.
Also Read: NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ తేదీలపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన..
Also Read: NEET OBC Reservations: నీట్ పీజీ కౌన్సెలింగ్.. సీట్ల కోటాను ఖరారు చేసిన సుప్రీం ధర్మాసనం
Also Read: TN Jallikattu Guidelines: ఒమిక్రాన్ అయినా ఏమైనా.. తమిళనాడు తగ్గేదేలే! జల్లికట్టుకు పచ్చజెండా
Also Read: Precautionary Covid Vaccine: దేశవ్యాప్తంగా ప్రికాషన్ డోసు పంపిణీ.. ఈ విషయాలు తెలుసుకోండి!