BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 23 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు, అర్హతలివే!
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు.
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు జూన్ 28 నుంచి జులై 12 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు...
* ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 23
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.472.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పనిప్రదేశాలు: పోర్ట్ బ్లెయిర్, కవరట్టి, గురుగ్రామ్, కొచ్చి, గాంధీనగర్, కోల్‌కతా, విశాఖపట్నం, చెన్నై, ముంబయి, బెంగళూరు.
జీతభత్యాలు: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.
చిరునామా: DM (HR/NS), Bharat Electronics Limited,
Jalahalli Post, Bengaluru - 560013.
ముఖ్యమైన తేదీలు..
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.06.2023.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరి తేది: 12.07.2023.
ALSO READ:
కాకినాడ జీజీహెచ్‌లో 97 స్టాఫ్ నర్స్ పోస్టులు, వివరాలు ఇలా!
కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సంబంధిత చిరునామాలో సమర్పి్ంచాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్ ప్రాతిపదికన బోర్డింగ్, లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..