BECIL: ఎయిమ్స్ జమ్ములో 29 పేషెంట్ కేర్ మేనేజర్, కోఆర్డినేటర్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
BECIL Jobs: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) జమ్ము ఎయిమ్స్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BECIL Recruitment: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) జమ్ము ఎయిమ్స్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. కేర్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.30,000; పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.17,000 జీతంగా ఇస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 29
➥ పేషెంట్ కేర్ మేనేజర్: 07 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ(లైఫ్ సైన్సెస్)లో (హాస్పిటల్/హెల్త్‌కేర్) మేనేజ్‌మెంట్‌లో ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కలిగి ఉండాలి.
అనుభవం: హాస్పిటల్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.30,000.
➥ పేషెంట్ కేర్ కోఆర్డినేటర్: 22 పోస్టులు
అర్హత: లైఫ్ సైన్సెస్‌లో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
అనుభవం: హాస్పిటల్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.17,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.02.2024.
ALSO READ:
ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటీఎస్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,082, ఎంటీఎస్ పోస్టులకు రూ.17,494 జీతంగా ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..