BECIL: ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటీఎస్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
BECIL Jobs: న్యూఢిల్లీలోని బీఈసీఐఎల్ షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BECIL Notification: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,082, ఎంటీఎస్ పోస్టులకు రూ.17,494 జీతంగా ఇస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 18
➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 15 పోస్టులు
అర్హత: ఏదైనా ఫీల్డ్‌లో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం, ఎంఎస్ ఎక్సెల్‌లో ప్రావీణ్యంతో పాటు కనిష్ట టైపింగ్ వేగం (ఇంగ్లీష్) 35 wpm కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
➥ ఎంటీఎస్: 03 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
కేటగిరీ వారీగా రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:
➥ జనరల్ అభ్యర్థులకు- రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ.590.)
➥ ఓబీసీ అభ్యర్థులకు- రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590)
➥ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు- రూ.531.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ.354)
➥ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు– రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590)
➥ మహిళలు అభ్యర్థులకు- రూ.885. (అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు రూ.590)
➥ ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులకు- రూ.531.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.354)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
వేతనం: నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,082. ఎంటీఎస్ పోస్టులకు రూ.17,494.
రిజిస్ట్రేషన్ 7 దశల్లో పూర్తి చేయాలి:
స్టెప్1: అడ్వర్టైజ్‌మెంట్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్2: ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 3: విద్య వివరాలు/ పని అనుభవం నమోదు చేయాలి.
స్టెప్ 4: స్కాన్ చేసిన ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్/ 10వ తరగతి సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 5: అప్లికేషన్ ప్రివ్యూ లేదా సవరించాలి.
స్టెప్ 6: చెల్లింపు ఆన్‌లైన్ మోడ్ (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI మొదలైనవి)
స్టెప్ 7: దరఖాస్తు ఫారమ్ చివరి పేజీలో పేర్కొన్న ఈమెయిల్ ఐడికి మీ స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లను ఈమెయిల్ చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.02.2024.
ALSO READ:
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..