UPSC: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
UPSC Recruitment: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 69.
➥ స్పెషలిస్ట్ (గ్రేడ్-3)- కార్డియాలజీ: 03 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పీజీ స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ స్పెషలిస్ట్ (గ్రేడ్-3)- నెఫ్రాలజీ: 04 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పీజీ స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ స్పెషలిస్ట్ (గ్రేడ్-3)-న్యూరో సర్జరీ: 06 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ స్పెషలిస్ట్ (గ్రేడ్-3)-టీబీ, రెస్పిరేటరీ మెడిసిన్/ పల్మనరీ మెడిసిన్: 03 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ స్పెషలిస్ట్ (గ్రేడ్-3)-జనరల్ సర్జరీ: 24 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత స్పెషాలిటీలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ సైంటిస్ట్ ‘బి’(సివిల్ ఇంజినీరింగ్): 20 పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ సైంటిస్ట్ ‘బి’ (ఎర్త్ సైన్సెస్): 06 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (ఎర్త్ సైన్స్/జియో ఫిజిక్స్/ఫిజిక్స్/జియోలజీ/ఓషనోగ్రఫీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ సైంటిస్ట్ ‘బి’ (మెకానికల్ / మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్): 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (మెకానికల్ / మెకాట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ అసిస్టెంట్ డైరెక్టర్: 01 పోస్టు
విభాగం: అఫిషియల్ లాంగ్వేజ్.
అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.02.2024.