AP Jobs: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 351 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అర్హతలివే!
పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వైద్య, ఆరోగ్య శాఖలోని ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉన్నవారు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పనిఅనుభవం ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 351
1) సివిల్ అసిస్టెంట్ సర్జన్- స్పెషలిస్ట్ (లిమిటెడ్ రిక్రూట్‌మెంట్): 341 పోస్టులు
స్పెషాలిటీల వారీగా ఖాళీలు: గైనకాలజీ-60, అనస్తీషియా-51, పీడియాట్రిక్స్-51, జనరల్ మెడిసిన్-75, జనరల్ సర్జరీ-57, రేడియాలజీ-27, పాథాలజీ-08,
ENT-09, ఫోరెన్సిక్ మెడిసిన్-03.
2) సివిల్ అసిస్టెంట్ సర్జన్- స్పెషలిస్ట్ (జనరల్ రిక్రూట్‌మెంట్): 10 పోస్టులు
స్పెషాలిటీల వారీగా ఖాళీలు: అనస్తీషియా-09, పాథాలజీ-01
అర్హతలు: పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: అర్హత పరీక్ష మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వయోపరిమితి: 01-07-2022 నాటికి గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.08.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.08.2022
CAS - SPECIALISTS LIMITED NOTIFICATION
CAS-SPECIALISTS GENERAL NOTIFICATION
Related Articles:
APSACS Jobs: ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో 140 ఖాళీలు - టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతలు!
ఏపీలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద వివిధ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దరఖాస్తులు కోరుతుంది. కాంట్రాక్టు పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలను నిర్ణయించారు. దీనిప్రకారం పదోతరగతి, ఎంబీబీఎస్, సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజి, ఆంత్రోపాలజి, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ,పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయసు పోస్టల వారీగా 18-42, 18-62, 18-65 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత జిల్లా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చు. దరఖాస్తు నింపి సంబంధిత జిల్లా కార్యాలయాల్లో తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...
AP Jobs: ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 పోస్టులు, వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య & కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...