AP SACS Jobs: ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో 140 ఖాళీలు - టెన్త్, డిగ్రీ, పీజీ అర్హతలు!
ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. జిల్లాలవారీగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి.. కాంట్రాక్టు పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏపీలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద వివిధ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దరఖాస్తులు కోరుతుంది. కాంట్రాక్టు పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలను నిర్ణయించారు. దీనిప్రకారం పదోతరగతి, ఎంబీబీఎస్, సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజి, ఆంత్రోపాలజి, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ,పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయసు పోస్టల వారీగా 18-42, 18-62, 18-65 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత జిల్లా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పొందవచ్చు. దరఖాస్తు నింపి సంబంధిత జిల్లా కార్యాలయాల్లో తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీలు: 140 పోస్టులు
1) విజయనగరం జిల్లా
మొత్తం పోస్టులు: 11
పోస్టులవారీగా ఖాళీలు: మెడికల్ ఆఫీసర్-02, స్టాఫ్ నర్స్-02, ART ఫార్మసిస్ట్-02, ART ల్యాబ్ టెక్నీషియన్-01, డేటా మేనేజర్-01, ART కమ్యూనిటీ కేర్
కోఆర్డినేటర్-02, ICTC & PPTCT ల్యాబ్ టెక్నీషియన్-01.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 20.08.2022.
Notification & Application
Website
Also Read: ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 పోస్టులు, వివరాలివే!
2) ప్రకాశం జిల్లా
మొత్తం పోస్టులు: 30
పోస్టులవారీగా ఖాళీలు: ఐసిటీసీ కౌన్సిలర్-01, ల్యాబ్ టెక్నీషియన్-14, మెడికల్ ఆఫిసర్-04, డేటా మేనేజర్-01, స్టాఫ్ నర్స్-08, ఫార్మాసిస్ట్-02.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.08.2022.
Notification & Application
Website
Also Read: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!
3) పశ్చిమగోదావరి జిల్లా
మొత్తం పోస్టులు: 23
పోస్టులవారీగా ఖాళీలు: మెడికల్ ఆఫీసర్-03, స్టాఫ్ నర్స్-06, కౌన్సెలర్-03, ల్యాబ్ టెక్నీషియన్-07, ఫార్మసిస్ట్-03, కమ్యూనిటీ కేర్ కోఆర్డినేటర్-01
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 24.08.2022.
Notification & Application
Website
4) అనంతపురం జిల్లా
మొత్తం పోస్టులు: 22
పోస్టులవారీగా ఖాళీలు: ICTC కౌన్సెలర్-03, ICTC ల్యాబ్ టెక్నీషియన్-06, మెడికల్ ఆఫీసర్-03, స్టాఫ్ నర్స్-05, ART కౌన్సెలర్-01, STI కౌన్సెలర్-01, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్-01, బ్లడ్ ట్రాన్స్‌పొటేషన్ వ్యాన్ డ్రైవర్-01, బ్లడ్ ట్రాన్స్‌పొటేషన్ వ్యాన్ అటెండెర్-01.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 22.08.2022.
Notification & Application
Website
Also Read: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 టీజీటీ, పీజీటీ పోస్టులు - వివరాలు ఇవే!
5) కాకినాడ జిల్లా
మొత్తం పోస్టులు: 35
పోస్టులవారీగా ఖాళీలు: ART మెడికల్ ఆఫీసర్-03, ART స్టాఫ్ నర్స్-03, LAC ప్లస్ స్టాఫ్ నర్స్-02, ART కౌన్సెలర్-03, ART ల్యాబ్ టెక్నీషియన్-02, ART ఫార్మిసిస్ట్-01, ICTC కౌన్సెలర్స్-09, ICTC ల్యాబ్ టెక్నీషియన్-08, DSRS కౌన్సెలర్స్-01, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్-01, బ్లడ్ బ్యాంక్ అటెండెంట్-01, SRL ల్యాబ్ టెక్నీషియన్-01.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 22.08.2022.
Notification & Application
6) పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
మొత్తం ఖాళీలు: 19
పోస్టులవారీగా ఖాళీలు: మెడికల్ ఆఫిసర్: 01, ICTC కౌన్సిలర్-04, ICTC ల్యాబ్ టెక్నీషియన్-09, స్టాఫ్ నర్స్-03, ఫార్మాసిస్ట్-02.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేది: 23.08.2022.
Notification
Website