News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Jobs: ఏపీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 622 పోస్టులు, వివరాలివే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య & కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య  & కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. క్లినికల్, సూపర్ స్పెషాలిటీ, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. 

పోస్టుల వివరాలు..

మొత్తం ఖాళీలు : 622

1) అసిస్టెంట్ ప్రొఫెసర్ (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్): 375

2) అసిస్టెంట్ ప్రొఫెసర్ (లేటరల్ ఎంట్రీ లెవల్): 247

అర్హత: 04.08.2022 నాటికి అభ్యర్థులు ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ /డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ/ఎంసీఐ/ఎంఎస్సీ/డీసీఐ/ పీహెచ్‌డీ(సంబంధిత స్పెషలైజేషన్) విద్యార్హత కలిగి ఉండాలి.

స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్‌టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, రేడియాలజీ, రేడియోథెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ అడ్మినిస్ట్రేషన్.

వయోపరిమితి (04.08.2022 నాటికి):
* ఓసీ అభ్యర్థులు 42 సంవత్సరాలలోపు ఉండాలి. 04.08.2022 - 03.08.1980 మధ్య జన్మించి ఉండాలి.

* SC/ST/EWS/BC అభ్యర్థులు 47 సంవత్సరాలలోపు ఉండాలి. 04.08.2022 - 03.08.1975 మధ్య జన్మించి ఉండాలి.

* దివ్యాంగులు 52 సంవత్సరాలలోపు ఉండాలి. 04.08.2022 - 03.08.1970 మధ్య జన్మించి ఉండాలి.

* ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 50 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించారు. 04.08.2022 - 03.08.1972 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ,ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం:
మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వీటిలో పీజీ డిగ్రీ, సూపర్ స్పెషాలిటీ ఉత్తీర్ణతకు 75 మార్కులు ఇస్తారు. ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ సర్వీసులకు 15 మార్కులు ఉంటాయి. కోవిడ్ సమయంలో సేవలందించిన వారికి 10 శాతం వెయిటేజీ ఇస్తారు. ఇందుకుగాను వారు సర్వీసు సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారు సదరు సంస్థ నుంచి NOC తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.08.2022.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 20.08.2022.

 

Notification 

 

Online Application

 

Related Article:

ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!
ఏపీ వైద్యారోగ్య శాఖ వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీహెచ్‌), ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) విభాగాల పరిధిలోని పారా మెడికల్‌, ఇతర పోస్టుల భర్తీకి ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. నిర్ణీత అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి...


Also Read:

టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం కానిస్టేబుల్(పయోనిర్) గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండి, గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆగస్టు 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

 

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 14 Aug 2022 11:12 AM (IST) Tags: DME AP Recruitment 2022 Directorate of Medical Education Recruitment Assistant Professor Jobs