News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

APPSC: ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

ఏపీలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. అన్ని పోస్టులకు అక్టోబరు 10న జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

ఏపీలోని వివిధ ప్రభుత్వశాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌), గ్రూప్-4 సర్వీసెస్‌లో వివిధ పోస్టులు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆపీసర్ (ఏపీ జువైనల్ వెల్ఫేర్ కోరిలేషనల్ సబ్ సర్వీసెస్‌), టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ), జూనియర్ ట్రాన్స్‌లేటర్-తెలుగు (ఏపీ), టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ & జియోలజీ సబ్ సర్వీస్), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్). అన్ని పోస్టులకు అక్టోబరు 3న జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్-1) పరీక్ష నిర్వహించనున్నారు.

పేపర్-2 పరీక్ష షెడ్యూలు ఇలా..

➥ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌): 27.09.2023 

➥ గ్రూప్-4 సర్వీసెస్‌లో వివిధ పోస్టులు: 04.10.2023

➥ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆపీసర్ (ఏపీ జువైనల్ వెల్ఫేర్ కోరిలేషనల్ సబ్ సర్వీసెస్‌): 05.10.2023 

➥ టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్): 27.09.2023 

➥ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ): 27.09.2023

➥ జూనియర్ ట్రాన్స్‌లేటర్-తెలుగు (ఏపీ): 05.10.2023

➥ టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ మైన్స్ & జియోలజీ సబ్ సర్వీస్): 05.10.2023.

➥ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్): 04.10.2023.

19 నుంచి హాల్‌టికెట్లు..
అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ (మత్స్యశాఖ), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌), టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్-ఏపీ గ్రౌండ్ వాటర్) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను సెప్టెంబరు 19 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. 

ALSO READ:

TS TET: సెప్టెంబరు 27న 'టెట్‌' ఫలితాల వెల్లడి, త్వరలోనే ఆన్సర్ 'కీ' విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సెప్టెంబరు 15న సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్‌-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో కఠినంగా వచ్చే పేపర్‌-1 ప్రశ్నపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్‌-2 మాత్రం కఠినంగా ఇచ్చారు. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. టెట్ పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరించి, తుది కీ ప్రకటించనున్నారు. అయితే అక్కడక్కడ ఓఎమ్మార్‌ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 16 Sep 2023 01:03 PM (IST) Tags: APPSC Exam Dates APPSC Exams Schedule APPSC Group4 Exams APPSC Assistant Inspector Posts APPSC Junior Translator Posts APPSC NonGazetted Posts Exams

ఇవి కూడా చూడండి

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

NITW: వరంగల్ నిట్‌లో గ్రూప్‌-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?

టాప్ స్టోరీస్

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు