అన్వేషించండి

RBI: రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

RBI Recruitment: ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

RBI Recruitment: ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వివరాలు..

* అసిస్టెంట్ పోస్టులు

మొత్తం ఖాళీలు: 450

శాఖల వారీగా ఖాళీలు..

అహ్మదాబాద్: 13

బెంగళూరు: 58

భోపాల్: 12

భువనేశ్వర్: 19

చండీగఢ్: 21

చెన్నై: 01

గువాహటి: 26

హైదరాబాద్: 14

జైపుర్: 5

జమ్మూ: 18

కాన్పుర్ & లక్నో: 55

కోల్‌కతా: 22

ముంబయి: 101

నాగ్‌పుర్: 19

న్యూఢిల్లీ: 28

పట్నా: 01

తిరువనంతపురం & కొచ్చి: 16

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.

వయోపరిమితి: 01-09-2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల(జనరల్‌) సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.50.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పే స్కేల్: నెలకు రూ.20,700 నుంచి రూ.55700.

పరీక్ష విధానం: ప్రాథమిక పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(30 ప్రశ్నలు- 30 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు), రీజనింగ్‌ ఎబిలిటీ(35 ప్రశ్నలు- 35 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రధాన పరీక్ష(ఆబ్జెక్టివ్‌)లో రీజనింగ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌(40 ప్రశ్నలు- 40 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 13.09.2023 నుంచి 04.10.2023 వరకు.

➥ ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు: 13.09.2023 నుంచి 04.10.2023 వరకు.

➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ టెస్ట్ తేదీలు: 21.10.2023, 23.10.2023.

➥ ఆన్‌లైన్ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ: 02.12.2023.

Notification

Website

ALSO READ:

నిమ్స్‌లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైమ్ లెక్చరర్ పోస్టులు, వివరాలు ఇలా
ఉస్మానియా యూనివర్సిటీ తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఎంబీఏ, ఎంసీఏ అర్హత ఉన్నవారికి 60 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో బయోడేటా పూర్తి వివరాలతోపాటు, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను జతచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget