అన్వేషించండి

TS TET: సెప్టెంబరు 27న 'టెట్‌' ఫలితాల వెల్లడి, త్వరలోనే ఆన్సర్ 'కీ' విడుదల

తెలంగాణలో టెట్‌ సెప్టెంబరు 15న సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్‌-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) సెప్టెంబరు 15న సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్‌-1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్‌ -2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో కఠినంగా వచ్చే పేపర్‌-1 ప్రశ్నపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్‌-2 మాత్రం కఠినంగా ఇచ్చారు. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. 

టెట్ పేపర్-1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరించి, తుది కీ ప్రకటించనున్నారు. అయితే అక్కడక్కడ ఓఎమ్మార్‌ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి.

27న ఫలితాల వెల్లడి..
ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా, సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు కొన్నిచోట్ల ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌.. ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి ఓఎమ్మార్‌ను పంపిణీ చేయడం, ఆ తర్వాత తప్పిదాలు జరిగినట్టుగా గుర్తించడంతో వైట్‌నర్‌తో చెరిపివేశారు. వైట్‌నర్‌ వాడిన ఓఎమ్మార్‌ షీట్లు చెల్లుబాటవుతాయని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ALSO READ:

రిజర్వ్ బ్యాంకులో 450 అసిస్టెంట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 450 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నిమ్స్‌లో 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 34 ఇంజినీర్‌ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎస్‌) ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 16, 17 తేదీల్లో వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, లేదా పీజీ అర్హత ఉన్నవారు వాక్-ఇన్‌కు హాజరుకావచ్చు. అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూరించి, అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలను నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget