అన్వేషించండి

AP Group 1 Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల, 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

Andhra Pradesh Group 1 Results | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేసింది.

APPSC Group 1 Results | అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు నిర్వహించిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 4 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. కమిషన్ 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. జూన్ 23వ తేదీ నుంచి 30 వరకు ఏపీ గ్రూప్-1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మెయిన్స్ నిర్వహించిన నెల రోజులకే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు మంగళవారం నాడు విడుదల చేసింది. గ్రూప్ 1 రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 

ఏపీ గ్రూప్ 1 ఫలితాలు డైరెక్ట్ లింక్

ఏపీలో గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్‌కు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496 మంది మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. మే నెలలో పరీక్షలు నిర్వహించి, వాల్యుయేషన్ తరువాత ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేశారు. జూన్ 10న రాత్రి మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి.

గ్రూప్ 1 కేసు విచారణ

వైసీపీ హయాంలో జరిగిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కుంభకోణం కేసు విచారణ కొనసాగుతోంది. ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ల మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. గ్రూప్ 1 అక్రమాల కేసులో పోలీసులు పేపర్ వాల్యూవేషన్లో పాల్గొన్న 60 మందిని విచారించారు. ఈ క్రమంలో క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ ధాత్రి మధును హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఆదేశాల మేరకు గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్లో భారీ అక్రమాలకు క్యామ్‌సైన్‌ తెరలేపిందని దర్యాప్తులో గుర్తించారు. ఏ అర్హత లేనివారు, సబ్జెక్ట్ తెలియని వారు, గృహిణులతో పేపర్లు వాల్యుయేషన్ చేశారని గుర్తించారు. హాయ్‌ల్యాండ్‌ వేదికగా మాన్యువల్‌ వాల్యుయేషన్ జరగలేదని పోలీసులు తెలిపారు. కొందరు వ్యక్తులను తాత్కాలికంగా నియమించుకుని పేపర్లు కరెక్షన్ చేపించారని అభియోగాలున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget