అన్వేషించండి

AP DSC: ఆంధ్రప్రదేశ్‌లో ఏటా డీఎస్సీ, మంత్రి నారా లోకేష్‌ గుడ్‌ న్యూస్

AP DSC: ఏపీ విద్యావ్యవస్థను నెంబర్‌వన్‌గా మార్చేందుకు ఏటా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్‌. ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.

AP DSC: నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్‌ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా 16వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ఇకపై ఇదే కంటిన్యూ అవుతుందని వివరించారు. ఉపాధ్యాయుల భర్తీ చేస్తూ విద్యా ప్రమాణాలు మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఆదర్శవంతమైన విద్యావిధానం తీసుకొస్తామని వెల్లడించారు. 

వయోజన విద్యకు ప్రాధాన్యత

పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్‌ విద్యాసంవత్సర సన్నద్ధతను పరిశీలించారు. రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అ-ఆ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. అక్షర ఆంధ్ర పేరుతో ఈ ప్రాజెక్టులో అందరూ భాగమవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే అఆ ప్రాజెక్టులో 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారిని అక్షరాస్యులుగా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏజ్‌ గ్రూప్‌లో నిరక్షరాస్యులుగా ఉన్న వారు ఏపీలో 81 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీళ్లకు చదువు నేర్పిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ వంద శాంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే తక్షణమే అఆ వయోజన విద్యామిషన్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 109 పోస్టులను విద్యాశాఖ నుంచి భర్తీ చేసుకోవాలని సూచించారు.   

పారదర్శకంగా బదిలీలు

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడమే కాకుండా సర్వీస్‌లో ఉన్న వారికి పదోన్నతలు కల్పించామన్నారు. ఎలాంటీ రికమండేషన్స్‌ లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా బదిలీలు చేపట్టామన్నారు. 4 వేల మందికి ప్రమమోషన్లు ఇస్తే... 27వేల మంది SAస్కూల్ అసిస్టెంట్లను బదిలీలు చేశామని వివరించారు.  

నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు 

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 16వేల పోస్టుల భర్తీకి ఇవాల్టి నుంచి పరీక్షలు జరగుతున్నాయి. రోజుకు రెండు పూటలు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో పరీక్షల సెంటర్లు ఇచ్చారు. 

శుక్రవారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు 30వ తేదీ వరకు కొనసాగునున్నాయి. మొదటి రోజు జరిగిన డీఎస్సీ పరీక్షకు దాదాపు 87 శాతం మంది హాజరయ్యారని అధికారులు లోకేష్‌కు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16437 పోస్టులకు 3,36, 305 మంది అప్లై చేశారు. వీళ్ల నుంచి 5, 77,675 దరఖాస్తులు వచ్చాయి. వీళ్లకు 44 దశల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు దయం 9 గంటల నుంచి 12.30వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 137 ఎగ్జామ్‌ సెంటర్‌లు, ఇతరాష్ట్రాల్లో అంటే హైదరాబాద్, బెర్హంపూర్, చెన్నై, బెంగళూరులో మరో 17 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

తొలిరోజు ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు ముగిశాయి.  ఉదయం 91 కేంద్రాల్లో16, 102 మందికి 14, 281 మంది, సాయంత్రం 51 కేంద్రాల్లో 8790 మందికి 7611 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా కడప, నెల్లూరు జిల్లాల్లో పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు. 
 

టాప్ హెడ్ లైన్స్

MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget