APPSC: ఆగస్టు 2 నుంచి 'గ్రూప్-1' అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, పూర్తి షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 సర్వీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 2 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 సర్వీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 2 నుంచి 11 వరకు ప్రతిరోజు 30 మంది అభ్యర్థుల చొప్పున, చివరి రోజు మాత్రం 10 మందికి ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను తేదీలవారీగా అందుబాటులోఉంచింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో రోజుకు రెండు షిఫ్టుల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకుగాను 259 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది.
ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ జనవరి 27న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపికచేశారు. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగింది.
గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..
'గ్రూప్-1' ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, పోస్టుల సంఖ్య పెరిగిందోచ్! ఎన్ని పోస్టులంటే!
ALSO READ:
ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు, వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్(ఎన్‌ఈఎస్‌టీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 4062 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జాతీయస్థాయి రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial