News
News
X

AP Police SI Exam: ఎస్ఐ రాతపరీక్ష ప్రశాంతం, 1.51 లక్షలమంది హాజరు - ఫ‌లితాలు ఎప్పుడంటే?

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,51,243 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసు నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ఆన్సర్ కీని ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. 

FOLLOW US: 
Share:

➥ రాష్ట్రవ్యాప్తంగా 291 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ

➥ పరీక్షకు హాజరైన 1,51,243 మంది అభ్యర్థులు 

➥ 20న కీ, రెండు వారాల్లో ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమిన‌రీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 411 పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసిన 291 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,51,243 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసు నియామక మండలి (APSLPRB) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష ఫ‌లితాలను రెండు వారాల్లోనే విడుద‌ల చేయనున్నట్లు, ఆన్సర్ కీని ఫిబ్రవరి 20న విడుదల చేయనునున్నట్లు బోర్డు  వెల్లడించింది.

ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం..
అలాగే ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాల నమోదుచేయవచ్చు. కింద చూపిన ఫార్మాట్‌లో అభ్యంతరాలను ఈమెయిల్ SCTSI-PWT@slprb.appolice.gov.in ద్వారా తెలపాల్సి ఉంటుంది. 

పోస్టుల వివరాలు..

* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు 

ఖాళీల సంఖ్య: 411

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జోన్ జిల్లా/ఏరియా పోస్టులు
జోన్-1 (విశాఖపట్నం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 50
జోన్-2 (ఏలూరు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 105
జోన్-3 (గుంటూరు) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్-4 (కర్నూలు) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప 105
  మొత్తం  315

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  24
రాజమహేంద్రవరం 24
మద్దిపాడు - ప్రకాశం  24
చిత్తూరు 24
మొత్తం 96

ఎస్‌ఐ ఉద్యోగాల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Website

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ ద్వారా.

🔰 ప్రిలిమినరీ పరీక్ష విధానం:

➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.

➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.

➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

🔰  ఫిజికల్ ఈవెంట్లు ఇలా..

➨ సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
➨ ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.

రేపటితో ముగియనున్న కానిస్టేబుల్ 'పార్ట్-2' రిజిస్ట్రేషన్ గడువు..
ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 5న వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు (20.73 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించి స్టేజ్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించేందుక అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా slprb@ap.gov.in మెయిల్‌లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది.
AP Constable Part - II Registration 

Published at : 19 Feb 2023 11:36 PM (IST) Tags: AP Police SI Exam AP Plioce SI Preliminary Exam AP SI Prelims Exam AP Police SI Exam Answer Key AP Police SI Exam Details

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు, అర్హతలు ఇవే!

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు

SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!

SSC MTS Final Result: మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 2021 తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు 7494 మంది ఎంపిక!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా