AP High Court Results: ఏపీ హైకోర్టు ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదల, వివరాలు ఇలా!
హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.
హైకోర్టులో వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 241 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.
వివరాలు..
మొత్తం ఉద్యోగాలు: 241
1. హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్- 09
2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 13
3. కంప్యూటర్ ఆపరేటర్- 11
4. ఓవర్సీర్- 01
5. అసిస్టెంట్ ఓవర్సీర్- 01
6. అసిస్టెంట్- 14
7. ఎగ్జామినర్- 13
8. టైపిస్ట్- 16
9. కాపీయిస్టు- 20
10. డ్రైవర్- 08
11. ఆఫీస్ సబార్డినేట్- 135
ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా..
ఎంపిక ప్రక్రియ: ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.
Also Read:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టులు, అర్హతలివే!
గుజరాత్‌లోని వడోదర ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
DAO HallTickets: డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్‌లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2, పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
జూనియర్ ఇంజినీర్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పేపర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రీజియన్లవారీగా అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూనియర్ ఇంజినీర్ పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 26న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష హాల్‌టికెట్లు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..