అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP High Court: 2018 'గ్రూప్‌-1' మెయిన్స్‌ రద్దు, ఏపీ హైకోర్టు కీలక తీర్పు, ఎందుకంటే?

APPSC Group 1 Exam: ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది.

APPSC Group 1 Exam: ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో (2018లో) జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను మాన్యువల్ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ.. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను పరిగణనలోకి తీసుకోకుండా.. రెండోసారి మూల్యాంకనం చేసి, నచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలను వెల్లడించిందని వారు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు పరీక్షను రద్దుచేస్తూ.. మార్చి 13న తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షను తిరిగి ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ ఏపీపీఎస్సీకి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 2018లో 167 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాల్సిందేనని జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు. అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్‌ వన్‌ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది.

ఏపీలో 167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి  2018 మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80250 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు; పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకు 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. వీటి ఫలితాలను వెల్లడించి, ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపికచేసింది. తాజాగా హైకోర్టుల మెయిన్స్ పరీక్షను రద్దుచేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

ALSO READ:

'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే, పరీక్ష వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఏపీపీఎస్సీ మార్చి 10న హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్నంగా చదువుకోవాలని కమిషన్ సెక్రటరీ తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.
హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget