అన్వేషించండి

APPSC Group-1 Halltickets: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే, పరీక్ష వివరాలు ఇలా

AP Group1 Halltickets: ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఏపీపీఎస్సీ మార్చి 10న హాల్‌టికెట్లను విడుదల చేసింది.

APPSC Group1 Prelims Halltickets: ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఏపీపీఎస్సీ మార్చి 10న హాల్‌టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్నంగా చదువుకోవాలని కమిషన్ సెక్రటరీ తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఆయన సూచించారు.

గ్రూప్-1 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించనున్నారు.

గ్రూప్-1 పోస్టుల వివరాలు..

ఖాళీల సంఖ్య: 81

1) డిప్యూటీ కలెక్టర్: 09 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

2) అసిస్టెంట్ కమిషనర్: 18 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

3) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-డీఎస్పీ (సివిల్) క్యాట్-2: 26 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

4) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-(మెన్): 01 పోస్టు 
విభాగం: ఏపీ జైళ్ల శాఖ.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

5) డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ (ఫైర్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

6)  రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్: 06 పోస్టులు
విభాగం: ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

7) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

8) డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

9) డిప్యూటీ రిజిస్ట్రార్: 05 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

10) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 01 పోస్టు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

11) అసిస్టెంట్ ప్రొహిభిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్: 01 పోస్టు
విభాగం: ఏపీ ఎక్సైజ్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

12)  అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీ/అకౌంట్స్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

3) డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

14) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పేపర్-1లో 120 ప్రశ్నలు-120 మార్కులు, పేపర్-2లో 120 ప్రశ్నలు-120 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు. పేపర్-1లో హిస్టరీ అండ్ కల్చర్ (పార్ట్-ఎ); కాన్‌స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (;పార్ట్-బి), ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ & ప్లానింగ్ (పార్ట్-సి), జియోగ్రఫీ (పార్ట్-డి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

Group1 Application: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

మెయిన్స్ పరీక్ష విధానం..
మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

Group1 Application: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Union Bank Of India Posts: యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
యూనియన్ బ్యాంక్‌లో 395 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, రూ. 47 లక్షల వరకు ప్యాకేజీ
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget