AIASL: ఏఐఏఎస్‌ఎల్‌లో 130 సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
AIASL Recruitment: ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AIASL Recruitment: ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది. ఉదయం 0900 నుంచి 1200 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు. శారీరక దారుఢ్య పరీక్ష, ఆంగ్ల ప్రావీణ్యత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు (వ్యక్తిగత లేదా వర్చువల్) ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 130
* సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
చెన్నై: 34
ముంబై: 96
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులు 28 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 31 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 33 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: శారీరక దారుఢ్య పరీక్ష, ఆంగ్ల ప్రావీణ్యత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు (వ్యక్తిగత లేదా వర్చువల్) ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: నెలకి రూ.27,450.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 01.02.2024 నుంచి 03.02.2024.
సమయం: ఉదయం 0900 నుంచి 1200 గంటలు.
వేదిక:
చెన్నై :
AI Airport Services Limited,
AI Unity Complex,
Pallavaram Cantonment,
Chennai 600043.
ముంబై:
AI Airport Services Limited,
GSD Complex, CSMI Airport,
Near CISF GateNo.5, Sahar,
Andheri East, Mumbai 40099.
ALSO READ:
రైల్వే శాఖలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని కేటాయించారంటే?
RRB ALP Recruitment 2024 Notification: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5,696 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ పరిధిలో 758 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 199 పోస్టులు, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 559 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిభ్రవరి 19 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.