అన్వేషించండి

NFTs: నాన్ ఫంగీబుల్ టోకెన్లలో భారత్ వాటా ఎంత..?

NFTs: బ్లాక్ చైన్ ద్వారా నాన్ ఫంగీబుల్ టోకెన్ల(NFT) పేరుతో ఆదాయాన్ని ఆర్జించొచ్చు. మన వద్ద ఒరిజినల్ కంటెంట్ ఉంటే దాన్ని బ్లాక్ చైన్ ప్రొవైడర్ల ద్వారా వేలం వేసి టోకెన్ల రూపంలో ఆదాయాన్ని సముపార్జించడమే NFT కాన్సెప్ట్.

NFTs: ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా.. ఇలా రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కంటెంట్ ప్రొవైడర్లు, ఇతర టాలెంటు ఉన్నవాళ్లు ఆదాయాన్ని సముపార్జిస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని తామిస్తామంటూ ముందుకొస్తున్నారు బ్లాక్ చైన్ ప్రొవైడర్లు. క్రిప్టో కరెన్సీకి మూలమైన బ్లాక్ చైన్ ప్రొవైడర్లు.. నాన్ ఫంగీబుల్ టోకెన్ల(NFT) పేరుతో ఆదాయాన్ని అందిస్తామంటున్నారు. మన వద్ద ఒరిజినల్ కంటెంట్ ఉంటే దాన్ని బ్లాక్ చైన్ ప్రొవైడర్ల ద్వారా వేలం వేసి టోకెన్ల రూపంలో ఆదాయాన్ని సముపార్జించడమే NFT కాన్సెప్ట్. భారత్ లోని కళాకారులు, కంటెంట్ ప్రొవైడర్లు ఇప్పుడిప్పుడే NFT వైపు ఆకర్షితులవుతున్నారు. 

భారత్ లోని సినీ, గేమింగ్ పరిశ్రమలకు NFTల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కళాకారులు, వివిధ వేదికల యజమానులు వేలం ద్వారా ఊహకందని ఆదాయాన్ని పొందేందుకు NFTలు సరికొత్త ఉపాధి మార్గాన్ని చూపెడుతున్నాయి. 

భారత్‌లో 2021లో 86కి పైగా యాక్టివ్ NFT-ఆధారిత స్టార్టప్‌ లు మొదలయ్యాయి. వాటిలో 71 స్టార్టప్‌ లను 2021లో తొలిసారిగా ప్రవేశ పెట్టారు. 2021లోనే సెలబ్రిటీలు తమ సొంత డిజిటల్ లైన్ ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి వరకు వారంతా యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా రెవెన్యూపై ఆధారపడ్డారు. అయితే NFTల విషయంలో థర్డ్ పార్టీలకు అవకాశమే ఉండదు కాబట్టి, మరింత ఆదాయాన్ని సముపార్జించే అవకాశం ఉంటుంది.

అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, మనీష్ మల్హోత్రాతో సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు తమ డిజిటల్ టోకెన్‌ లకు 2021లోనే పథక రచన చేశారు. ఎన్‌ఎఫ్‌టీలు విడుదల చేశారు. మరికొందరు త్వరలోనే ఆవిష్కరించబోతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రీడాకారులు తమ అభిమానులకు తమ ఉత్పత్తులను సొంతంగా అందించడానికి NFT మార్కెట్ ను ఉపయోగించుకుంటున్నారు. NFTలలోని మొత్తం కళాఖండాల విలువ 50 బిలియన్ డాలర్లకు చేరువ అవుతుందని అంచనా. 

ముందుగా NFTలో అకౌంట్ తీసుకుని, దానికి పాస్ వర్డ్ జతచేసి మన దగ్గర ఉన్న ఒరిజినల్ కంటెంట్ ద్వారా ఆదాయాన్ని అందుకోవచ్చు. ఓటీటీలకు మరింత అడ్వాన్స్ గా ఈ NFT రూపొందుతోంది. అయితే ఇప్పటి వరకూ సెలబ్రిటీలు మాత్రమే ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. సామాన్యులు కూడా దీనిపై దృష్టిసారించే రోజులు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఆన్ లైన్ కరెన్సీ క్రిప్టోకు కూడా భారత్ లో త్వరలో అనుమతి లభిస్తుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో NFTల మార్కెట్ కూడా విస్తృతం అవుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తుందని చెబుతున్నారు.

Disclaimer: The opinions, beliefs, and views expressed by the various authors and forum participants on this website are personal. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions. Cryptocurrency is not a legal tender and is subject to market risks. Readers are advised to seek expert advice and read offer document(s) along with related important literature on the subject carefully before making any kind of investment whatsoever. Cryptocurrency market predictions are speculative and any investment made shall be at the sole cost and risk of the readers.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
Embed widget