Viral research: వారానికి ఒక్క సారైనా శృంగారం లేకపోతే మహిళల మానసిక ఆరోగ్యం ప్రభావం - మెడికల్ రీసెర్చ్‌లో కీలక విషయాలు
Couples: ప్రపంచవ్యాప్తంగా మహిళల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న వాటిలో శృంగారం కూడా ఉంది. తగినంత శృంగారం అనుభవించని మహిళలు సమస్యల పాలవుతున్నారు.

Warning to couples: మనుషి శరీరానికి నీరు,ఆహారం ఎంత అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరమని కొంత మంది నిపుణులు చెబుతూ ఉంటారు. లోతుగా ఆలోచిస్తే ఇదే నిజమని దాదాపుగా అందరూ అంగీకరిస్తారు. రీసెర్చులు కూడా ఇవే చెబుతున్నాయి. తాజాగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెక్సువల్ హెల్త్ చేసిన రీసెర్చ్ మహిళలు వారానికి ఒక్క సారి కన్నా శృంగారం రుచి చూస్తూంటే వారికి మానసిక ఆరోగ్య పరంగా సమస్యలు వస్తున్నాయని తేల్చింది.
వారానికి కనీసం ఒక్క సారి అయినా శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యం
కొత్త అధ్యయనం ప్రకారం, వారానికి కనీసం ఒకసారి శృంగార సుఖం పొందుతున్న ఉన్న మహిళలు తమ సంబంధంలో అత్యంత సంతోషంగా ఉన్నారని తేలింది. ఈ అధ్యయనం న్యూజిలాండ్‌లోని 483 మహిళలపై జరిగింది. వారానికి కనీసం ఒకసారి శృంగారం చేసిన మహిళలు 85 శాతం మహిళలు తాము "లైంగికంగా సంతృప్తి" చెందినవారిగా చెప్పుకున్నారు. నెలకు ఒకసారి మాత్రమే శృంగారంలో పాల్గొంటున్న మహిళలు 66 శాతం మాత్రమే సంతృప్తిని ప్రకటించారు. నెలకు ఒకసారి కంటే తక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటున్న మహిళలలో కేవలం 17% మాత్రమే శారీరక సుఖం విషయంలో సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పారు.
మహిళలు ప్రతీ సారి సంతృప్తి స్థితికి చేరుకోరు కానీ వారికి ఆనందమే !
యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ పరిశోధకురాలు అలెగ్జాండ్రా జాన్సెన్ ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఎక్కువ శృంగారం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారా, లేక సంతోషంగా ఉన్నందున ఎక్కువ శృంగారంలో పాల్గొంటున్నారా అన్నది స్పష్టంగా తెలియదని ఆమె చెబుతున్నారు. కొన్ని సార్లు పిల్లలను ప్లాన్ చేసుకుని ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొన్నారు. శృంగాన్ని "చాలా ముఖ్యమైనది"గా భావించే మహిళలు తమ సంబంధంలో ఎక్కువ సంతోషాం ఉందని చెప్పారు. అయితే శృంగారంలో పాల్గొనడం వేరు.. సంతృప్తస్థాయికి చేరుకోవడం వేరు. ఇలా సంతృప్త స్థాయికి చేరుకునే మహిళలు సాధారణంగా ఎక్కువ సంతోషంగా ఉంటారు. అయితే ప్రతీ సారి మహిళలు సంతృప్తి స్థాయికి చేరుకోవడం సాధ్యం కావొచ్చని అంటున్నారు. కానీ ఆనందిస్తారని అంటున్నారు.
శారరీక సుఖం తగినంతగా లేకపోతే మానసిక ఆరోగ్యంపై ప్రభావం
18-24 ఏళ్ల మహిళలు అత్యధిక శృంగారంలో ఆనందం ఉందని చెబుతున్నారు. 45 ఏళ్లు పైబడిన మహిళలు తమ సన్నిహిత సంబంధంలో పెద్దగా సంతోషం లేదని చెప్పారు. బ్రిటన్‌లో 60 శాతం మంది వారానికి ఒకసారి కంటే తక్కువ శృంగారం పాల్గొంటారు. 10 శాతం మంది వారానికి ఒకసారి, 15 శాతం మంది ఎక్కువ తరచుగా శృంగారంలో పాల్గొంటారు. ఇతర అధ్యయనాల ప్రకారం, రెగులర్ శృంగారం మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తక్కువ శృంగారం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.





















