Food Colours: ఫుడ్ కలర్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే - తింటే క్యాన్సర్ ఆస్తమా ముప్పు
ఫుడ్ కలర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అవి కలిపితే చాలు ఆహారానికి మనకి నచ్చిన రంగు వచ్చేస్తుంది.
పిల్లల ఆహారం ఎప్పుడు రంగురంగుల్లో ఉండాలి, అలా ఉంటేనే వారికిష్టం. అంతెందుకు బయట మనకు దొరికే చిరుతిళ్లు, చాక్లెట్లు, క్యాండీలలో చాలా వాటిలో ఆహార రంగులు కలుపుతారు. అప్పుడే వాటికి కంటికింపైన ఆ రంగులు వస్తాయి. అయితే నిత్యం ఈ ఫుడ్ కలర్స్ ఉండే ఆహారాలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం బయట తినే చాలా ఆహారాలు కృత్రిమ రంగులు, రుచులను కలిగి ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,కొందరిలో ఫుడ్ కలర్స్ అలెర్జీకి కారణం అవుతాయి. శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక్కోసారి రోగనిరోధక వ్యవస్థ సొంత శరీరంపైనే ప్రతి చర్యను చూపిస్తుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది.
ఈ సమస్యలు తప్పవు...
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ చేసిన అధ్యయనాల ప్రకారం కృత్రిమ ఆహార రంగుల వాడకం వల్ల పిల్లల్లో చాలా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
1. పిల్లల్లొ హైపర్ యాక్టివిటీతో పాటూ, ఆటిజం రావచ్చు.
2. చిరాకు, డిప్రెసన్, మానసిక ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి.
3. శరీరంపై దద్దుర్లు రావచ్చు.
4. ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది.
5. క్యాన్సర్ కణితులు శరీరంలో పెరిగే అవకాశం ఉంది.
ఈ ఆహారాల్లో ఎక్కువ...
మనం రోజూ తినే ఆహారాల్లో చాలా ఉత్పత్తుల్లో ఆహార రంగులు కలుపుతారు. మన నిత్య జీవితంలో తినే పదార్ధాల్లో కింది ఇచ్చిన వాటిలో అధికంగా రంగులు కలుపుతారు. కానీ కలిపినట్టు కూడా మనం గుర్తించలేం.
1. వెనిల్లా ఐస్ క్రీమ్
2. బాల్సమిక్ వెనిగర్
3. తెల్ల రొట్టె
4. పాప్ కార్న్
5. బయట అమ్మే ఊరగాయలు
6. సలాడ్ డ్రెస్సింగ్
7. చూయింగ్ గమ్
8. బయట అమ్మే పెరుగు (తెలుపు రంగు)
9. ఎనర్జీ బార్ చాక్లెట్లు
10. ఓట్స్ వంటకాలు
11. చిప్స్
12. చాక్లెట్లు
13. క్యాండీలు
14. రంగుల స్వీట్లు
15. కూల్ డ్రింకులు
పైన చెప్పినవి తిన్నాక మీకు కింద చెప్పిన లక్షణాలు కనిపిస్తే, వాటి వల్ల మీకు అలెర్జీ కలిగిందని, పడడం లేదని అర్థం.
1. శరీరం నుంచి వేడి ఆవిర్లు వచ్చినట్టు అనిపించడం
2. తలనొప్పి
3. శరీరంపై దద్దుర్లు
4. చర్మంపై దురద
5. చర్మం ఎరుపు
6. ముఖం,పెదవులు, నుదురు ప్రాంతాల్లో వాపు రావడం
7. ఛాతీ బిగుతుగా మారడం
8. మైకం, వికారం రావడం
9. రక్తపోటు తగ్గడం
10. శ్వాస ఆడకపోవడం
పూర్తిగా రంగులు కలిపిన పదార్థాలు మానేయడం కష్టమే, కానీ తగ్గించుకుంటే మంచిది. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లోనే రంగులు కలుపుతారు. కాబట్టి వాటిని తినడం క్రమేణా తగ్గించుకుని, పండ్లు, కూరగాయలపై ఆధారపడాలి.
Also read: కుంకుమ పువ్వు కాశ్మీరానిదే, 2022లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (GI) పొందిన 6 ఆహారాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.