Health Emergency in China : చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
Health Emergency in China : కరోనా పుట్టినిల్లు చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
Health Emergency in China : కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను సైతం వణికించిన మహమ్మారి. ప్రధానంగా శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్.. ప్రజలను తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేసింది. చిన్న పిల్లలను సైతం వదలని ఈ వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. ఆ వైరస్ మిగిల్చిన నష్టాలు ఇప్పటికీ తీరనివి. అయితే తాజాగా ఈ వైరస్‌కు సంబంధించిన వార్తలు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలోనే మరోసారి ఈ కొవిడ్ 19 తరహా వైరస్‌లు అతలాకుతలం చేస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది. రకరకాల వైరస్‌ల వ్యాప్తితో అక్కడి ప్రజలు పెద్దఎత్తున ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అనేక మంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇలా మల్టిపుల్ వైరస్‌లు మూకుమ్మడిగా వ్యాప్తి చెందుతుండడంతో ఆ దేశం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత మరోసారి ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ పెరుగుదల
చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఇది ఆరోగ్య సమస్యలకు దోహదపడుతున్నట్టు తెలుస్తోంది. ఓ వార్తా కథనం ప్రకారం, 2001 ప్రారంభంలో ఈ శ్వాసకోశ వైరస్ ఉత్తర ప్రాంతాల్లో కనిపించింది. ముఖ్యంగా 14 ఏళ్లలోపు వారిలో ఈ వైరస్ వ్యాప్తిని గుర్తించారు. నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా కేస్ వెరిఫికేషన్, లాబొరేటరీ రిపోర్టింగ్ ప్రక్రియలను ప్రారంభించింది. ముఖ్యంగా HMPV, డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు తీవ్రమవుతున్నాయి. శీతాకాలంలో సాధారణంగానే శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ కొత్త వైరస్ వ్యాప్తి జరుగుతోందన్న ఆందోళనల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య అధికారులు మాస్క్‌లు ధరించడం, చేతులను తరచుగా కడుక్కోవడం వంటి భద్రతా చర్యలను సిఫార్సు చేస్తున్నారు.
ఈ వైరస్ ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, డబ్ల్యూహెచ్వో ఈ పరిస్థితిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. చైనాలో, హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్‌తో సహా వైరల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నట్లు నివేదికలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ వ్యాధికి సంబంధించి 7,834 కేసులు నమోదు కాగా, 170 మంది మరణించారు. ఈ కేసులన్నీ కూడా చైనాలోనే నమోదైనట్లు సమాచారం.
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ప్రజలు హ్యూమన్ మెటాప్న్యూమో అనే వైరస్ బారిన పడుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ ప్రపంచం మొత్తానికి సోకే ప్రమాదమున్నందున డబ్ల్యూహెచ్వో కొత్త కరోనా వైరస్ మహమ్మారిని అత్యవసర పరిస్థితిగా పరిగణిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదా అధికారులు స్పందించడం గానీ జరగనప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, వార్తలు చైనాలో పరిస్థితి తీవ్రంగా ఉందని సూచిస్తున్నాయి.
⚠️ BREAKING:
— SARS‑CoV‑2 (COVID-19) (@COVID19_disease) January 1, 2025
China 🇨🇳 Declares State of Emergency as Epidemic Overwhelms Hospitals and Crematoriums.
Multiple viruses, including Influenza A, HMPV, Mycoplasma pneumoniae, and COVID-19, are spreading rapidly across China. pic.twitter.com/GRV3XYgrYX
సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్‌లో ఈ కొత్త వైరస్ వ్యాధిపై అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. చైనాలో అత్యవసర పరిస్థితిని విధించారనే ఊహాగానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో కిక్కిరిసిన పేషంట్స్‌ను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆ దేశంలోని ఆసుపత్రుల్లో నమోదవుతోన్న కేసుల కారణంగా చైనా అత్యవసర పరిస్థితిని విధించిందనే వాదనకు మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు, వివరాలు లేవు.
Absolutely NOT.
— Liz Churchill (@liz_churchill10) January 1, 2025
We are NOT doing this again.
“China Declares State of Emergency as Epidemic Overwhelms Hospitals and Crematoriums. Multiple viruses, including Influenza A, HMPV, Mycoplasma pneumoniae, and COVID-19, are spreading rapidly across China…” pic.twitter.com/WWmks4jOpK
Also Read : COVID KILLER Tea: ఈ 5 రకాల టీలతో కరోనా వైరస్‌కు చెక్ పెట్టొచ్చు- ఎలాగో తెలుసా?