అన్వేషించండి
Sharad Pawar Covid Positive: ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్
ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కరోనా బారిన పడ్డారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు కొవిడ్ సోకగా తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
" కొవిడ్ పరీక్షల్లో నాకు పాజిటివ్ వచ్చింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా వైద్యుడి సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాను. కొద్దిరోజులుగా నాతో కాంటాక్ట్‌లో ఉన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. తగిన సూచనలు పాటించండి. "
-శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత
ప్రముఖులకు కరోనా..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకగా థర్డ్ వేవ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరందరికీ ఇటీవల కరోనా వచ్చింది.
- దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
- కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్
- రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్
- భాజపా ఎంపీ వరుణ్ గాంధీ
- మహారాష్ట్రలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు.
Also Read: Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















