Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్
ఇండియన్ ఆర్మీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మెరికల్లాంటి జవాన్లు మన సైన్యం సొంతం. తాజాగా మన జవాన్ చేసిన ఓ సాహసం వైరల్ అవుతోంది.
![Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్ BSF jawan completes 47 push ups within 40 seconds in biting cold weather Watch Viral video Watch Video: ఎముకలు కొరికే చలిలో 40 సెకన్లలో 47 పుష్అప్స్.. సాహో సైనిక.. వీడియో వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/24/ed2b4755daabb4c836752c21a3269e2c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉదయం 9, 10 గంటలైనా మనలో చాలా మంది దుప్పటి తన్నిపెట్టి పడుకుంటారు. కాస్త చలిగా అనిపించినా ఉదయాన్నే లేవాలనే అనిపించదు. కానీ దేశ సంరక్షణ కోసం రక్తం గడ్డకట్టే చలిలో మన సైనికులు పహారా కాస్తుంటారు. ఎంత ధైర్యం, గుండె తెగువ కావాలి కదా..! అలా చెయ్యడానికి. అయితే చాలా సార్లు సరిహద్దులో మన జవాన్లు చేసే సాహసాలు చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది. అదేంటో మీరే చూడండి.
40 సెకన్లలో..
40 seconds. 47 push ups.
— BSF (@BSF_India) January 22, 2022
Bring it ON.#FitIndiaChallenge@FitIndiaOff@IndiaSports
@@PIBHomeAffairs pic.twitter.com/dXWDxGh3K6
ఎముకలు కొరికే చలి.. పైగా మంచు వర్షంలా కురుస్తోంది. అలాంటి చోట మన దేశ జవాను ఒకరు 40 సెకన్లలో 47 పుష్అప్స్ తీశారు. అవును.. ఈ వీడియోను బీఎస్ఎఫ్ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఎంతో అవలీలగా ఆ జవాను ఈ పుషప్‌లను పూర్తి చేశారు.
సింగిల్ హ్యాండ్..
One Handed Push Ups.
— BSF (@BSF_India) January 23, 2022
How many can YOU?
Bring it ON.#FitIndiaChallenge@FitIndiaOff@IndiaSports@PIBHomeAffairs https://t.co/HxadaZ3CcH pic.twitter.com/pcRwl2kTks
అలాగే మరో జవాన్ ఒంటి చేతితో పుష్ఆప్స్ చేశారు. ఈ రెండు వీడియోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన బీఎస్ఎఫ్.. ఫిట్ ఇండియా ఛాలెంజ్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలను నెటిజన్లు చూసి సెల్యూట్ ఇండియా, జయహో ఇండియాన్ ఆర్మీ అంటూ కామెంట్ చేస్తున్నారు. భారత ఆర్మీ పవర్ ఏంటో మరోసారి చూపించారంటూ కామెంట్లు చేస్తున్నారు. చలికి ఎముకలు కొరుకుతున్న చలించక దేశాన్ని కాపు కాసే ఓ సైనికా.. నీకు 'దేశం' సెల్యూట్.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)