అన్వేషించండి

Saffron Tea Benefits : ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు కుంకుమ పాలు కాదు.. టీ తాగండి

రోటీన్ టీలకు చెక్ పెడుతూ.. మీ రోజూవారి శైలిలో కుంకుమ పువ్వు టీని చేర్చుకోండి. దీనివల్ల మానసిక, శారీరక ప్రయోజనాలు పొందవచ్చు.

సాధారణంగా ప్రెగ్నెంట్ అయినవారికి.. తల్లి, శిశువు బాగుండాలని కుంకుమ పాలు ఇస్తారు. ఎందుకంటే కుంకుమలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి. అది ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు తెలియక చాలా మంది దానికి దూరంగా ఉంటారు. కానీ దాని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అన్నింటికంటే ముందు దీనిని తీసుకుంటారు. శారీరక, మానసిక సమస్యలను దూరం చేయడంలో ఇది మీకు సహాయం చేస్తుంది.

మీరు హెల్త్ కోసం ఎన్నో టీలు తాగి ఉంటారు కానీ.. రుచికరమైన, సువానస అందించే టీలు రేర్​గా దొరుకుతాయి. అలా దొరికిన వాటిలో ఆరోగ్యాన్ని అందించేవి రేర్. అలాంటి వాటిలో కుంకుమ పువ్వు టీ బెస్ట్. ఇది మీ ఉదయాన్ని కానీ.. సాయంత్రాన్ని కానీ కచ్చితంగా రిఫ్రెష్ చేస్తుంది. మరి దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కొలెస్ట్రాల్​ తగ్గిస్తుంది..

కుంకుమపువ్వు టీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. అంతేకాకుండా దీనిలోని క్రోసెటిన్​ను రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. గుండె జబ్బులను దూరం చేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో జీర్ణక్రియను మెరుగపరచి.. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు.. బరువు తగ్గేలా చేస్తుంది. 

మధుమేహం కంట్రోల్

కుంకుమపువ్వు అందించే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం, మెల్లిటస్, ప్రీ డయాబెటిస్​ను కంట్రోల్ చేస్తుంది. షుగర్​తో ఇబ్బంది పడేవారు.. టీకి బదులుగా కుంకుమపువ్వు టీ తాగొచ్చు. 

పీరియడ్స్ నొప్పి నుంచి రిలీఫ్..

కుంకుమపువ్వు ఓ సాంప్రదాయ ఔషదం. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు.. కడుపులోని సమస్యలను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండేవారు.. ఉపశమనం కోసం దీనిని తాగవచ్చు. 

డిప్రెషన్​కు..

కుంకుమపువ్వులో యాంటి డిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని డిప్రెషన్​నుంచి బయటకు తీసుకువస్తాయి. మీ మానసిక, శారీరక డిటాక్స్ కోసం దీనిని తీసుకోవచ్చు. 

క్యాన్సర్​కు వ్యతిరేకంగా..

దీనిలోని యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్​తో పోరాడుతాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఇది క్యాన్సర్​ రావాడాన్ని కూడా తగ్గిస్తుంది. 

మెరుగైన నిద్రకు..

కుంకుమ పువ్వులో టీలోని కార్డియోప్రొటెక్టివ్ జ్ఞాపకశక్తిని మెరుగపరుస్తుంది. దీనిలోని యాంజియోలైటిక్ ఆందోళనను తగ్గించి.. మెరుగైన నిద్రను అందిస్తుంది. 

వంధ్యత్వానికై..

స్పెర్మ్ డీఎన్​ఏ దెబ్బతింటే.. పురుషులలో వంధ్యత్వం కలుగుతుంది. కుంకుమపువ్వులో స్పెర్మ్ డీఎన్​ఎ నష్టాన్ని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. పలు అధ్యయనాలు కూడా దీనిని నిరూపించాయి.

మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు

ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సోరియాసిస్​ తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తూ.. యాంటీ ఏజింగ్ లాభాలను అందిస్తుంది. అంతేకాదండోయ్.. ఇది సెరోటోనిన్, డోపమైన, ఎండార్ఫిన్ గాఢతను పెంచుతుంది. ఇవి మీరు హ్యాపీగా ఉండేలా చేస్తాయి. అల్జీమర్స్, మూర్ఛ వంటి న్యూరో వ్యాధులను అరికట్టడంలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తుంది. 

ఒక కప్పు కుంకుమ పువ్వు టీతో మీరు ఒత్తిడిని దూరం చేసుకోవడంతో పాటు ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. ఓ టీనుంచి ఇంతకంటే ఏమి కావాలి? అయితే మీరు దీనిని తీసుకోవాలనుకున్నప్పుడు వైద్యుడిని కచ్చితంగా సంప్రదించండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా లేకున్నా.. వారి సూచనలతో దీనిని తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget