By: ABP Desam | Updated at : 12 Jan 2023 12:22 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
మధుమేహులు తీపి పదార్థాలు తినలేరు. కారణం అందులో పంచదార ఉంటుంది. దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కానీ ఇక వాళ్ళు ఎటువంటి భయం లేకుండా తీపి తినొచ్చని సరికొత్త అధ్యయనం వెల్లడించింది. అయితే అది పంచదార కాదు తేనె. పూల నుంచి వచ్చే పచ్చి తేనె తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
డయాబెటిస్ ఉన్న వాళ్ళు పంచదారకి బదులుగా కృతిమ స్వీటెనర్ ఉపయోగిస్తారు. అయితే ఇక నుంచి దానికి బదులుగా తేనె తీసుకుంటే కార్డియో మెటబాలిక్ రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తేనె, చక్కెర రెండు కార్బోహైడ్రేట్లు. అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ తో తయారు చేస్తారు. అయితే రెండూ వేర్వేరు పోషకాలు, ఆకృతి, రుచి కలిగి ఉంటాయి. కొన్ని పోషక అంశాల దృష్ట్యా తేనె ఆరోగ్యకరమైనదని అంటారు. సాధారణంగా స్వీటేనర్లు తరచుగా అనారోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. ఈ పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. జీర్ణాశయాంతర అసౌకర్యం లేదా పళ్ళు పుచ్చిపోతాయి.
కొందరికి తేనె వల్ల అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుందని మరికొంతమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులకు తేనె సురక్షితం కాదని అంటున్నారు. అలాగే కృత్రిమ చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు పెరిగే అవకాశాలు ఉన్నాయట.
టొరంటో పరిశోధకులు దాదాపు 18 క్లినికల్స్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఈ అధ్యయనం రూపొందించారు. ఇందులో దాదాపు 1100 మంది పాల్గొన్నారు. గుండె, జీవక్రియ ప్రమాద కారకాలపై తేనె ప్రభావం ఎంత వరకు ఉందనే దాని మీద పరీక్షలు జరిపారు. క్లోవర్, రోబినియా పూల ద్వారా వచ్చిన తేనె జీవక్రియ మీద సానుకూల ప్రభావాన్ని చూపించింది. ఈ తేనె తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ స్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. తేనె తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేదని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గింపు అనేది దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.
ప్రాసెస్ చేసే తేనెలో ఈస్ట్ ని తగ్గించడానికి వడకట్టడం, తక్కువ సమయం పాటు వేడి చేయడం వంటివి చేస్తారు. దీని వల్ల తేనెలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అదే ముడి తేనె వడకడతారు కానీ వేడి చేయరు. అయితే తేనెలో చాలా రకాలు ఉంటాయి. వాటన్నింటి మీద పరిశోధన చేయడం కష్టం. మిశ్రమ తేనె ఏ పూల నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. అందుకే ప్రత్యేకమైన సింగిల్ ఫ్లవర్ మూలాల నుంచి వచ్చిన తేనె మీద మరిన్ని పరిశోధనలు చేయాలసిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా తేనెకి తీపి రుచి ఎక్కువ కాబట్టి పరిమితంగా తీసుకోవడమే మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: IBS సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేద నివారణతో ఉపశమనం పొందొచ్చు
Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి
Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు
Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !