అన్వేషించండి

గుండె ఆరోగ్యాన్ని కాపాడే కొరియన్ సూపర్ ఫుడ్ ‘కిమ్చి’- దీని ఇంట్లోనే తయారు చేయొచ్చు

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ రోగనిరోధక శక్తిని పెంచే కొరియన్ సూపర్ ఫుడ్ కిమ్చి.

కొరియాకు చెందిన డ్రామాలు, సినిమాలకు భారతదేశంలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సాంప్రదాయ కొరియన్ వంటకాలను యూట్యూబ్లో చూసి ఆనందించేవారు ఎంతోమంది. కొరియన్ సూపర్ ఫుడ్ గా పేరు తెచ్చుకున్న కిమ్చి వంటకాన్ని మనం కూడా తినాలి. దానికి కారణం అందులో గుండె ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. కొరియన్ వంటకాలు ఎక్కువగా పులియబెట్టిన పదార్థాలు, కూరగాయలు, మాంసాలతో వండుతారు. అందుకే అవి ఆరోగ్యకరమైన పోషణను అందిస్తాయి. కిమ్చి కాస్త స్పైసీగా ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇందులో మసాలా దినుసులు, అల్లము, క్యారెట్టు, దోసకాయ, వంకాయ, పాలకూర, దుంపలు, వెదురు రెమ్మలు, వెనిగర్, చక్కెర వంటివన్నీ వేసి చేస్తారు. దీన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చేస్తారు. అన్నింటికన్నా ఫేమస్ ‘క్యాబేజీతో చేసే కిమ్చి’. ఇది ఊరగాయ లాగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. 

కిమ్చిని పులియబట్టి చేస్తారు. కాబట్టి ఇది అద్భుతమైన ప్రోబయోటిక్ ఆహారం అని చెప్పుకోవచ్చు. పెరుగు, పాల ఉత్పత్తుల్లో ఉండే లాక్టోబాసిల్లి అనే బాక్టీరియా కిమ్చీలో ఉంటుంది. ఇది జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల అలర్జీలు, మంట, మలబద్దకం, విరోచనాలు, గుండెల్లో మంట వంటివి రాకుండా ఉంటాయి.

కొరియన్ల చర్మం ఎంత మృదువుగా, బిగుతుగా ఉంటుందో కదా, అలాంటి మచ్చలేని చర్మాన్ని మనమూ పొందొచ్చు. వారి ఆహారపు అలవాట్లను కొంతవరకు పాటిస్తే అలాంటి చర్మం మన సొంతమవుతుంది. కిమ్చి వంటి ఆహారాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. అవి వృద్ధాప్యం రాకుండా అడ్డుకొని చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బరువు తగ్గేందుకు
బరువు తగ్గేందుకు కూడా కిమ్చి ఎంతో ఉపయోగపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అధిక బరువు ఉన్నవారు పులియబెట్టిన కిమ్చీని తినడం వల్ల శరీరంలోని కొవ్వు గణనీయంగా తగ్గుతుంది. కిమ్చి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి కిమ్చి చాలా అవసరం. ఇది అనేక హృదయ సంబంధ వ్యాధులకు కారణమైన కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తగ్గించే గుణం కిమ్చీలో ఉంది. ఆ లక్షణాలు తగ్గడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

ఎలా తయారు చేయాలి?
కిమ్చీని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో క్యాబేజీని ఉపయోగిస్తారు. క్యాబేజీని సగానికి కట్ చేసి ఉప్పును చల్లాలి. క్యాబేజీ  ముక్కలను ప్లాస్టిక్ సంచిలో వేసి ఆరేడు గంటల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల క్యాబేజీ బాగా నాని మెత్తగా అయిపోతుంది. తర్వాత ఆ క్యాబేజీ ముక్కలు నీటిలో వేసి పావుగంట సేపు ఉంచాలి.తర్వాత శుభ్రం చేయాలి. ఇప్పుడు మరొక గిన్నెలో తురిమిన ముల్లంగి ఉప్పు, పచ్చి ఉల్లిపాయల తరుగు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముద్ద, మిరపకాయలు, వరిపిండి, ఎర్ర మిరపకాయలు, చేపల సాస్ వేసి బాగా కలపాలి. కాస్త నీరు కూడా చేర్చాలి. ఇదే కిమ్చీ మిశ్రమం. కాండం నుండి క్యాబేజీ ఆకులను విడదీయకుండా అలాగే ఉంచి ఆకులపై ఈ కిమ్చి పేస్టును బాగా పూయాలి. ఆ మొత్తాన్ని ఒక గాలి చొరబడని కంటైనర్ లో వేసి మూడు నాలుగు రోజులు ఫ్రిజ్లో ఉంచాలి. అది బాగా పులిసి కిమ్చీ రెడీ అవుతుంది. ఇది పులియపెట్టిన వంటకం కాబట్టి లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా పుల్లగా ఉండడానికి సహాయపడుతుంది. ఆ బాక్టీరియా సురక్షితం కూడా. అయితే దీన్ని సరిగా నిల్వ చేయకపోతే తీవ్రమైన అల్పాహారంగా మారచ్చు. కాబట్టి జాగ్రత్తగా కిమ్చీని చేసుకోవాలి. దీనికి సులువైన మార్గం యూట్యూబ్లో కిమ్చి తయారీని చూసి చేసుకోవడమే.

Also read: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
Mukesh Nita Ambani: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
NC 24 Update : నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
Mukesh Nita Ambani: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ముఖేశ్​ అంబానీ దంపతుల భేటీ
NC 24 Update : నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
నాగ చైతన్య - కార్తీక్ దండు సినిమాకు క్రేజీ టైటిల్... 'విరూపాక్ష' అంత పవర్ ఫుల్​గా ఉందా?
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Sankranthiki Vasthunam : వెంకీ మామకు కలిసొచ్చిన 25 ఏళ్ల నాటి సెంటిమెంట్... 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఇదే
వెంకీ మామకు కలిసొచ్చిన 25 ఏళ్ల నాటి సెంటిమెంట్... 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ వెనకున్న సీక్రెట్ ఇదే
Hyderabad Crime: అమెరికాలో దుండగుడి కాల్పులకు హైదరాబాద్‌ యువకుడు మృతి
Hyderabad Crime: అమెరికాలో దుండగుడి కాల్పులకు హైదరాబాద్‌ యువకుడు మృతి
Tirupati News: తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
Embed widget