X

Jasmine Benefits: తలనొప్పితో బాధపడుతున్నారా? మల్లెపూలను పక్కన పెట్టుకుని నిద్రపోండి

వివిధ సమస్యలకు మల్లెపూలను ఎలా వాడితే ఉపశమనం దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. 

FOLLOW US: 

మల్లెపూలు (Jasmines) మానసిక ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు... మందుల్లా కూడా పని చేస్తాయని మీకు తెలుసా? వివిధ సమస్యలకు మల్లెపూలను ఎలా వాడితే ఉపశమనం దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. 

* తాజా మల్లెల్ని మెత్తగా నూరి... తడిబట్టపై చుట్టి కళ్లపై పెట్టుకుంటే కంటి నుంచి నీరు కారడం, తడి ఆరడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు ఉండటం వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతాం. మల్లెపూలు, గులాబీ ( Roses) పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తోంది. 

Also Read: Air purifier plants: ఈ మొక్కలు మీ ఇంట్లోని గాలిని శుభ్రం చేస్తాయి... ఆక్సిజన్ అందిస్తాయి

* తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో వాసన కట్టు కడితే ఉపశమనం కలుగుతుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది.

* ఇక జుట్టు బలంగా ఉండటానికి కూడా మల్లెపూలు చాలా బాగా పనిచేస్తాయి. దీని కోసం కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒక రోజంతా నానబెట్టాలి. తరవాత కాచి వడగట్టాలి. చల్లారిన తరువాత ఆ నూనెను తలకు రాసి మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు మంచి పోషకాలు అందుతాయి.

*కళ్లు మంటగా ఉన్నా... కంట్లో నొప్పిగా ఉంటే మల్లెల కషాయం దివ్యఔషధంలా పని చేస్తుంది. మల్లెపూలు, ఆకులతో ఈ కషాయం కాయాలి. ఈ కషాయాన్ని వడ గట్టి చల్లార్చిన తరువాత రెండు వంతుల కషాయంలో ఓ వంతు నువ్వుల నూనె, ఓ వంతు కొబ్బరి నూనె, ఒక స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు తలకు మర్దనా చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. 

* మధుమేహం ( Diabetes)తో బాధపడుతున్నవారు మల్లెపూల ఛాయ్ తాగాల్సిందే. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గంచే గుణం మల్లెపూలకు ఉంది.

* మీరు ఎండలో రోజంతా తిరిగి అలసిపోయిన తరువాత మీ ముఖానికి మల్లెపూలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని పూయండి. ఇది మీకు తక్షణ తాజాదనం ఇస్తుంది.

తరచూ ఎదురయ్యే మానసిక వ్యాకులత, డిప్రెషన్ ( Depression), అతికోపం, మానసిక చంచలత్వాన్ని స్థిరపర్చి శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు పూలను దిండు కింద పెట్టి పడుకోవడం గానీ లేదా దీర్ఘంగా సువాసన పీల్చడం గానీ చేయాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే నిద్ర హాయిగా పడుతుంది. మనస్సు స్థిమితంగా ఉంటుంది. 

Tags: LifeStyle Health Jasmine Jasminum Flower

సంబంధిత కథనాలు

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

పచ్చి మాంసాన్ని కసకస నమిలి తినేస్తున్నాడు.. కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

పచ్చి మాంసాన్ని కసకస నమిలి తినేస్తున్నాడు.. కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

టాప్ స్టోరీస్

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ

Covid Updates: తెలంగాణలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 3,944 కేసులు, ముగ్గురు మృతి

Covid Updates: తెలంగాణలో తగ్గని కోవిడ్ ఉద్ధృతి... కొత్తగా 3,944 కేసులు, ముగ్గురు మృతి