అన్వేషించండి

Air purifier plants: ఈ మొక్కలు మీ ఇంట్లోని గాలిని శుభ్రం చేస్తాయి... ఆక్సిజన్ అందిస్తాయి

కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మరికొన్ని పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి.

మొక్కలన్నీ గాలిలోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి కదా మరి అలాంటప్పుడు మళ్లీ ప్రత్యేకంగా గాలిని శుభ్రం చేసే మొక్కలేంటా అని అనుకుంటున్నారా? అన్ని మొక్కలు ఒకే రకంగా, ఒకే విధంగా శ్వాసక్రియను జరుపుకోవు. అదేవిధంగా ఆక్సిజన్‌ను విడుదల చేయవు. కొన్ని మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌, రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. అదీగాక అవి విడుదల చేసే ఆక్సిజన్‌ పరిమాణం చాలా తక్కువ. కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మరికొన్ని పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి. ఈ మొక్కలనే బయాలజిస్టులు ఆక్సిజన్‌ మొక్కలుగా పిలుస్తుంటారు. 

పట్టణాల్లో జీవనం సాగించేవారు ఇండ్ల మీద, బాల్కనీ, గోడలపై మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. వీరికి మొక్కలను కావల్సినంత ఎక్కువగా పెంచుకునేందుకు స్థలం ఉండదు కాబట్టి... ఉన్న కొద్ది ప్లేసులో ఈ ఆక్సిజన్ మొక్కలను పెంచుకుంటారు. తాజాగా కరోనా నేర్పిన పాఠాల కారణంగా ఈ మొక్కలకు మరింత డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా చేసుకుని నర్సరీ వాళ్లు సైతం రేట్లను అమాంతం పెంచేశారు. ఇంతకీ ఆక్సిజన్ అందించే ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Air purifier plants: ఈ మొక్కలు మీ ఇంట్లోని గాలిని శుభ్రం చేస్తాయి... ఆక్సిజన్ అందిస్తాయి

మనీప్లాంట్‌ ( Money Plant )
ఈ మొక్క సాధారణంగా అందరూ పెంచుకుంటారు. దీన్ని పోథోస్‌ ప్లాంట్‌ అని కూడా అంటారు. అలంకరణ మొక్కగా కూడా దీన్ని ఇంట్లో పెడుతుంటారు. మీకు తెలియని ఓ ప్రత్యేకత ఈ మనీ ప్లాంట్‌కి ఉంది. తెలిస్తే నిజంగా షాకవుతారు. ఈ మనీ ప్లాంట్ 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది.

తులసి ( Tulsi )
అనేక ఆయుర్వేద ఔషధగుణాలున్న మొక్క ఇది. అందుకే దీనిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పరిసరాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. రోజులో కనీసం 20 గంటల పాటు ఇది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటుంది. అదే విధంగా కార్బన్‌ డై యాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డై యాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులను సైతం ఇది పీల్చుకుని ప్రాణవాయువును అందిస్తుంది.

స్పైడర్‌ ప్లాంట్‌ ( Spider Plant )
ఇండోర్‌ ప్లాంట్‌గా ఎక్కువగా ప్రసిద్ధి. ఇంట్లోని గాలిని అధిక శాతం శుద్ధి చేస్తుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ఈ మొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే మనం తీవ్రమైన ఒత్తిడికి గురైన సమయంలో ఈ మొక్క మన సమీపంలో ఉంటే ఆ ఒత్తిడికి దూరం అవుతాం.


వీపింగ్‌ ఫిగ్‌ ( weeping fig )
ఇది ఫైకస్‌ రకానికి చెందిన మొక్క. నాసా గుర్తించిన ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క. ఇంటి పరిసరాల్లో ఉన్న ఫార్మాల్డిహైడ్‌, జైలిన్‌, టౌలిన్‌ తదితర కాలుష్య కారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది.


అరెకా ఫామ్‌ ( Areca palm )
ఈ మొక్క ప్రత్యేకతలెన్నో. చక్కటి ఇండోర్‌ ప్లాంట్‌. కార్బన్‌ డైయాక్సైడ్‌నే కాకుండా గాలిలోని కాలుష్యకారక వాయువులన్నింటినీ ఇది పీల్చుకుంటుంది. గాలిని శుద్ధి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ ( Oxygen )ను విడుదల చేస్తుంది.


జెర్బారా డైసీ (Gerbera Daisy)
ఇవి అలంకరణ మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ మొక్కల పుష్పాలను వేడుకల్లో అలంకరణ కోసం వినియోగిస్తుంటారు. అంతే కాదు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేయడం వీటి ప్రత్యేకత. కార్బన్‌తో పాటు ఇతర ప్రమాదకర కాలుష్యకార వాయువులను సైతం ఇది పీల్చుకుని పరిసరాలను శుద్ధి చేస్తుంది.


స్నేక్‌ ప్లాంట్‌ (Snake Plant)
నాసా గుర్తించిన మరో ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క ఇది. అంతేగాక ఎక్కువ మంది ప్రేమించే మొక్క. ఆక్సిజన్‌ను ఎక్కువ శాతం విడుదల చేస్తుంది. ఇంట్లోని గాలిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది. కార్బన్‌తో పాటు, ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, జైలిన్‌ వాయువులనే కాదు.. ట్రై క్లోరో ఇథలిన్‌, నైట్రోజన్‌ తదితర అధిక కాలుష్యకారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget