How to Schedule Copulation : కలయికకు కూడా షెడ్యూల్ ఫిక్స్ చేయాలట.. ఎందుకంటే?
Schedule Copulation : ప్రతి పనితో పాటు.. ఆ పనికి కూడా మీ క్యాలెండర్లో షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలంటున్నారు. అసలు ఈ షెడ్యూల్ ఎందుకో.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
How to schedule copulation with your partner : మనకి టైమ్ టూ టైమ్ పనులు జరగాలంటే.. వాటిని షెడ్యూల్ చేస్తాము. ఎందుకంటే వాటిని ఏ మాత్రం మిస్ చేయకూడదు అనుకుంటాం కాబట్టి. పైగా ముఖ్యమైన వాటినే మనం షెడ్యూల్ చేస్తాము. అలాగే సెక్స్ను కూడా షెడ్యూల్ చేయాలంటున్నారు నిపుణులు. అవును దంపతుల కలయికకు కూడా ఓ షెడ్యూల్ అంటూ ఉండాలి. ఎందుకంటే ఇది వారి మధ్య సత్సంబంధాలను పెంచుతుందట. ఎన్నో కారణాలతో శారీరకంగా దూరమైపోతున్న జంటలకు ఇది ఓ మంచి ఉపాయంగా చెప్తున్నారు.
మీ బిజీ షెడ్యూల్ని క్యాలెండర్లో ఎలా నోట్ చేసుకుంటారో.. దీనిని కూడా అలాగే షెడ్యూల్ చేసుకోవాలి. ఇదేమి తప్పుకాదండోయ్.. దీనికి కూడా షెడ్యూల్ చేయాలా? ఫ్లోలో జరిగిపోద్దిగా అనుకుంటే పొరపాటే. అలా ఫ్లో అనుకోబట్టే చాలా మంది లైఫ్ సెక్స్ లేకుండా పోతుంది. అలా అని దానికోసం ఓ టైమ్ ఫిక్స్ చేసుకుని యాంత్రికంగా చేయడం అవసరమా? అనే ప్రశ్న తలెత్తక మానదు. అలా అనుకుంటే కనీసం కొన్ని పనులు చేయకపోవడం కన్నా.. చేయాలన్నా కోరిక ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దాంపత్యుల మధ్య కొన్ని రోజులుగా మాటలు లేకపోయినా.. గొడవలు పడినా.. ఆ షెడ్యూల్ కోసం అయినా ఇద్దరూ ఆలోచిస్తారు. అలా వారి మధ్య సంభాషణ పెరుగుతుంది.
జీవితంలో దాదాపు ప్రతిదానికి ప్రణాళిక అవసరం. కానీ సాన్నిహిత్యం వేరు. ఎలాంటి ప్రణాళిక లేకుండా జరిగే ప్రక్రియ అది. కానీ ఒకప్పుడు ఉన్నంత ప్రేమ, శారీరక సంబంధాలు ఇప్పుడు ఉండట్లేదు. అన్ని విషయాలు మైండ్కి ఎక్కించుకుని అసలు విషయాన్ని అవసరం లేదని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇది మీకు పెద్ద తేడాని ఇవ్వకపోవచ్చు కానీ.. మీ భాగస్వామికి కచ్చితంగా అసంపూర్తి ఫీలింగ్ ఇస్తుంది. శారీరక సాన్నిహిత్యం లేకుండా దాంపత్యాన్ని దీర్ఘకాలం ముందుకు తీసుకెళ్లడం కుదరదు. ఒకవేళ అలా కలిసి ఉంటే ఏదో ఫార్మాలటీకి ఉన్నట్లే ఉంటుంది.
అలా అని రోజూ అదే పనిలో ఉండాలని కాదు. జంట జంటకు ఈ షెడ్యూల్ మారుతుంది. ఎవరి ఫిజకల్ అవసరాలు, సంబంధాలు, చుట్టూ ఉండే పరిస్థుతుల బట్టి దానిని ప్లాన్ చేసుకోవాలి. దాంపత్యుల మధ్య లైంగిక కోరికలు తగ్గిపోవడానికి ఇలాంటి షెడ్యూల్ లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఉండే కోరికలు.. పిల్లలు పుట్టిన తర్వాత అంతగా ఉండని.. కలవని దంపతులు చాలా మందే ఉన్నారు. అందుకే విరహానికి కూడా కాస్త సమయం కేటాయించాలంటున్నారు.
కేవలం దానికోసమే కాదు..
షెడ్యూల్ చేసుకున్న సమయంలో మీరు కేవలం కలయికనే కాదు.. ఏకాంతంగా మాట్లాడుకునే సమయం దొరుకుతుంది. మీ ఒత్తిడిని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఒకరికోసం ఒకరున్నారనే భరోసానిస్తుంది. ఒకరినొకరు ఎంత మిస్ అవుతున్నారో తెలుస్తుంది. మీ భాగస్వామి మీ నుంచి ఏమి కోరుకున్నారో మీకు తెలుస్తుంది.
బంధంలోకి అడుగుపట్టిన మొదట్లో ఉండే హార్మోన్ల ప్రభావం.. క్రమేపి తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది మీ దాంపత్యంలో ఉండకూడదనుకుంటే.. మీరు సెక్స్ కోసం ప్రత్యేక షెడ్యూల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ బంధానికో ఓ రోటీన్ను ఇస్తుంది. శారీరక బంధం ఎంత మెరుగ్గా ఉంటే.. మీ ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా ఉంటుందని గుర్తించుకోండి. అంతేకాకుండా కుటుంబ జీవితం కూడా సాఫీగా ఉంటుంది. ఓ కుటుంబంలోనైనా దంపతులు అన్యోన్యంగా ఉంటే.. ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటుంది.
Also Read : ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు కుంకుమ పాలు కాదు.. టీ తాగండి