Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? వాటిని సహజంగా బయటికి పంపించే డ్రింక్స్ ఇవే
చాలామంది కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతుంటారు. ఆ రాళ్ళను బయటికి పంపించడానికి కొన్ని సహజమైన డ్రింక్స్ ఉన్నాయి
కిడ్నీలో రాళ్లు చేరడం అనేది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. ఈ ఆరోగ్య సమస్యకు వయసుతో సంబంధం లేదు. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం కిడ్నీ స్టోన్స్ సమస్య కారణంగా ప్రతి ఏడాది ఐదు లక్షల మందికి పైగా ప్రజలు ఐసీయూలో చేరాల్సి వస్తోంది. ఈ సమస్య 10 శాతం మందిని తమ జీవితకాలంలో ఒక్కసారైనా ప్రభావితం చేస్తోందని అంచనా. కిడ్నీ స్టోన్స్ విషయంలో సకాలంలో స్పందిస్తే ఆ సమస్య చాలా త్వరగా పరిష్కారం అవుతుంది. ఎప్పుడైతే ఆ రాళ్లు పెద్దవిగా మారుతాయో అప్పుడు వాటిని తొలగించడానికి శస్త్ర చికిత్సలు అవసరం పడతాయి. అలా కాకుండా వాటి సైజు చిన్నగా ఉందని వైద్యులు చెప్పిన వెంటనే కొన్ని రకాల డ్రింక్స్ తాగడం చాలా మంచిది. ఇవి ఆ చిన్న రాళ్ళను సహజమైన పద్ధతిలో, మూత్రం ద్వారా బయటికి పంపించేందుకు సహకరిస్తాయి.
నీరు
కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు నీరు అధికంగా తాగాలి. శరీరంలో నీరు తగ్గిత్తే రాళ్ల సమస్య పెరిగిపోతుంది. నీళ్లు అధికంగా తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది. అలాగే ఏర్పడిన రాళ్లు బయటకు పంపేందుకు కూడా ఎక్కువ నీరు తాగడం అవసరం. అన్ని ద్రవాలు సహజంగా మూత్ర నాళం ద్వారా టాక్సిన్సులు బయటికి పంపిస్తాయి. అలాగే నీళ్లు అధికంగా తాగడం వల్ల ఆ చిన్న రాళ్లు మూత్రనాళం ద్వారా బయటికి వచ్చేసే అవకాశం ఉంది. మూత్రం రంగును బట్టి మనం నీరు తగినంత తాగుతున్నామో లేదో తెలుసుకోవచ్చు. లేత రంగులో ఉంటే నీరు సరిపడా తాగుతున్నట్టే అర్థం. అదే ముదురు రంగులో వచ్చింది అంటే శరీరం నీటి కొరతతో ఉందని అర్థం. శరీరం డీహైడ్రేషన్ కు గురైతే రాళ్ల సమస్య పెరిగిపోతుంది.
పాలు
కాలుష్యం కంటెంట్ అధికంగా ఉండే పాలు మూత్రపిండాల్లో రాళ్లను వదిలించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం. ఎందుకంటే కాల్షియం బలమైన ఎముకలకు అవసరం అలాగే ఆక్సలైట్ల శోషణను తగ్గిస్తుంది. కాబట్టి రోజూ గ్లాసు పాలు తాగాలి.
నిమ్మరసం
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా మంచిది. ప్రతిరోజు ఇలా తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. అలాగే ఈ డ్రింక్ మూత్రపిండాల్లో రాళ్లను విచ్చిన్నం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి రోజు ఈ డ్రింక్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు చేరకుండా చూసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ రాళ్లతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటిని సహజంగా బయటికి పంపించుకోవచ్చు
ఆపిల్ సిడర్ వెనిగర్
ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సిడర్ వెనిగర్ వేసి తాగాలి. ఇలా రోజు తాగడం వల్ల ఆ పానీయం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది లేదా విచ్చిన్నం చేస్తుంది. తద్వారా అవి మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి. అయితే ఈ డ్రింక్ ను మితంగా తాగడం చాలా మంచిది. ఎక్కువ తాగకూడదు. ఎందుకంటే ఇది పొట్టలోను ఆమ్లస్థాయిని పెంచేస్తుంది. దీనివల్ల పొట్ట గోడలు దెబ్బతింటాయి.
Also read: ముప్పై ఆరేళ్ల క్రితం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు ధరెంతో తెలుసా? వైరలవుతున్న రశీదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.