By: Haritha | Updated at : 03 Jan 2023 12:42 PM (IST)
(Image credit: Instagram)
రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు కొనాలంటై తక్కువలో తక్కువ కనీసం రెండు లక్షలైనా ఇప్పుడు పెట్టాలి. ఆ బైకులో వేరియేష్లను బట్టి మూడున్నర లక్షలు ధర పలికేవి కూడా ఉన్నాయి. ఈ బైక్ అంటే ఇష్టపడే అబ్బాయిలు ఎంతోమంది. వీటి నిర్మాణం వేరే బైకులతో పోలిస్తే డిఫరెంట్‌గా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350cc భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన బైక్. దీన్నే బుల్లెట్ అని పిలుచుకుంటారు చాలా మంది. ఎన్ని రకాల బైక్స్ వచ్చినప్పటికీ దీన్ని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కిందటి తరం నుంచి నేటి తరం వరకు ఇది వారసత్వంగా వచ్చింది. అయితే 1986 దీని ధరెంతో చెప్పే రశీదును రాయల్ ఎన్ ఫీల్డ్ వారు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.అదిప్పుడు వైరల్ అయింది.
అప్పట్లో అంతే...
ఆ రశీదు 1986, జనవరి 23 నాటిది. దీన్ని జార్ఖండ్లోని బొకారోలో సందీప్ ఆటో కంపెనీకి చెందిన డీలర్ కొన్నాడు. అప్పట్లో ఈ బైకు 18,700 రూపాయలు అని ఆ రశీదు ద్వారా తెలుస్తోంది. 36 ఏళ్ల తరువాత దీని ధర 11 రెట్లు పెరిగింది. ఈ రశీదును చూసిన నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. ఒక వ్యక్తి తాను 1984లో రాయల్ ఎన్ ఫీల్డు బైక్ కొన్నానని, దాని ధర 16,100 అని, 38 దాన్ని తాను వాడుతున్నట్టు చెప్పారు. మరో వ్యక్తి 1984లో తన తాత రెండు వేల రూపాయలకు భూమి కొన్నారని, అదిప్పుడు రెండు కోట్ల రూపాయలు అయ్యిందని రాశారు. అంటే బైక్ బదులు అప్పట్లో భూమి కొనడం బెటర్ అని అతని అభిప్రాయం. మరొక నెటిజన్ తాను 1980లో ముంబైలో ఈ బైక్‌ను పదివేల అయిదు వందల రూపాయలకు కొన్నట్టు చెప్పారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఇంగ్లాండు దేశానిది. 1893లో ఈ సంస్థను స్థాపించారు. మొదట్లో రైఫిళ్లను తయారుచేసేవారు. 1901లో తొలిసారి బైక్ తయారుచేశారు. వీటిని రెండో ప్రపంచం యుద్ధ సమయంలో సైనికులు వాడేవారు. 1965లో భారత ప్రభుత్వం కూడా సరిహద్దుల్లో పెట్రోలింగ్ కోసం ఈ బైక్‌లను కొంది. తరువాత 1994లో ఈ సంస్థను మనదేశానికి చెందిన ఐషర్ కంపెనీ కొనుక్కుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన దేశం నుంచే ఈ బైక్‌లు ఎగుమతి అవుతున్నాయి.
Also read: చలికాలంలో వెల్లుల్లి ఎక్కువ వాడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే దూరం పెట్టండి
Vegetarian Restaurant: ప్రపంచంలోనే అత్యంత పురాతన శాఖాహార రెస్టారెంట్ ఇదే - ఫుడ్ వెయిట్ ప్రకారమే బిల్లు
Bitter Gourd: కాకరకాయ చేదు వదిలించే సింపుల్ మార్గాలు ఇవే!
Parenting Tips: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా? మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని అర్థం
రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!