అన్వేషించండి
Advertisement
Weight Loss Tips: సులువుగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా? జస్ట్, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
కొత్త సంవత్సరంలో తీసుకున్న రిసోల్యూషన్స్ లో భాగంగా బరువు తగ్గాలని, ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లకు మరిపోవాలని మనలో చాలా మంది అనుకుంటూ ఉండి ఉంటారు.
బరువు తగ్గడానికి కావల్సింది క్యాలరీల బర్నింగ్. అంటే మనం ఎంత ఆహారం తిన్నమో అంతకు రెట్టింపు క్యాలరీలను కరిగించడం. క్యాలరీలను తగ్గించుకునేందుకు రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, చాలామందికి అతిగా వ్యాయామం చేసి బరువు తగ్గడం ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఈ కింది చిట్కాలు ఉపయోగపడొచ్చు. సులభంగా బరువు తగ్గిపోవచ్చు.
- లోషుగర్ కంటెంటెడ్ ప్యాక్డ్ ఫూడ్‌ను పెద్దగా నమ్మొద్దు. లేబుల్ పూర్తిగా చదివాకే వాడండి.
- బరువు తగ్గడం కోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. దీనిలో హెస్పెరిడిన్ అనే రకం ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.
- రీషి, కార్డిసెప్స్ రకానికి చెందిన మష్రూమ్స్ శరీరం కొవ్వులను శోషించుకుని నిల్వ చేసుకునే ప్రహసనాన్ని మారుస్తాయట. శరీరం ఆక్సిజన్ ను వినియోగించే విధానాన్ని మెరుగు పరచడం వల్ల రక్త ప్రసరణ విధానం మెరుగవుతుంది. కాబట్టి మష్రూమ్స్ తీసుకోవడం మంచిదే.
- స్కేటింగ్ తో కూడా క్యాలరీలను తగ్గించవచ్చు. జాగింగ్ కంటే ఇది మెరుగైనది. స్కేటింగ్ తో కీళ్ల మీద ఒత్తిడి పెద్దగా ఉండదు.
- రోజంతా ఎక్కువ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. భోజనానికి ముందు నీళ్లు తాగడం ద్వారా ఆకలి తగ్గినట్లు అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి కూడా.
- వాకింగ్ నుంచి రన్నింగ్ వరకు ఏదైనా అవుట్ డోర్ వర్కవుట్ ద్వారా చాలా మంచి ఫలితాలు తక్కువ సమయంలో రాబట్టవచ్చు. దీనితో ఒత్తిడి కూడా తగ్గుతుంది.
- ముందు మీరు చాలా స్లిమ్ అయినట్లు ఊహించుకోండి. అటువంటి ఒక విజువలైజేషన్ మీ మనసులో చేసుకొని దాని కోసం శ్రమించడం మొదలు పెట్టండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది.
- బరువు తగ్గాలన్న మీ ఆలోచనను ప్రొత్సహించేవారు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. ప్రోత్సాహం ఎప్పుడూ ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది.
- ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవాలి. చాలా సార్లు ఎక్కువ ఫైబర్ కలిగిన ఆహారంలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
- నిద్ర సరిపడినంత లేకపోయినా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కనుక 6, 7 గంటల నిద్ర ప్రతి రోజూ తప్పనిసరి.
- స్టీమ్ బాత్ లేదా వేడి నీటి స్నానం కూడా శరీరంలో కాలరీలను కరిగిస్తుంది. వ్యాయామం చెయ్యడానికి బద్ధకించిన రోజు ఆవిరి స్నానానికి వెళ్లడం మంచి ఆప్షన్.
- అల్లం చాయ్ తాగడం ద్వారా శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం మాత్రమే కాదు బరువు కూడా తగ్గుతారు.
- ఆపిల్ సైడర్ వెనిగర్ మంచి డైజెస్టివ్ టానిక్, బ్లోటింగ్ తగ్గిస్తుంది. సలాడ్ డ్రెస్సింగ్ లో వాడొచ్చు లేదా కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు.
- షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా క్యాలరీలు ఖర్చవుతాయి.
- ముందుగా వెజిటబుల్స్ పూర్తి చేసి ఆతర్వాత కార్బ్స్ తినడం అలవాటు చేసుకోవడం మంచిది.
- ఆకలిని మేనేజ్ చేసేందుకు కాఫీ ప్రియులు కాఫీ తాగడం కూడా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
- ఎక్కువగా ప్లాంట్ బెస్డ్ ప్రొటీన్ తీసుకునేందుకు ప్రయత్నించాలి.
- గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, నిమ్మ రసం, ఐస్ రుచి కోసం కలిపి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- హులా హోపింగ్ చాలా మంచి వ్యాయామం. దీనిలో మీకు అనుభవం లేకపోతే కాస్త బరువు ఎక్కువ ఉన్న దాన్ని తిప్పేందుకు ప్రయత్నించండి. ఇది తిప్పడం చాలా సులభం.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement