By: ABP Desam | Updated at : 26 Oct 2021 04:43 PM (IST)
చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ (File Photo)
Apollo Corona Vaccine: దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వడానికి పలు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ రూపొందించిన కోవిషీల్డ్ తో పాటు రష్యాకు చెందిన స్పూత్నిక్ వి వ్యాక్సిన్ సహా మరికొన్ని వ్యాక్సిన్లు ఇస్తున్నారు. 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారికి అంటే చిన్నారులకు సైతం కొవిడ్19 టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ విషయంపై అపోలో హాస్పిటల్స్ శుభవార్త అందించింది. చిన్నారులకు అపోల్ హాస్పిటల్స్ ఉచితంగా కొవిడ్19 వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అపోలో ఆసుపత్రుల్లో కొన్ని ప్రత్యేక ఆరోగ్య లక్షణాలున్న చిన్నారులకు ఉచితంగా కరోనా టీకాలు వేయనున్నామని హెల్త్ కేర్ గ్రూప్ తెలిపింది. చిన్నారులకు అత్యవసర వినియోగం కోసం కరోనా టీకాలకు త్వరలో ఆమోదం లభించనున్న తరుణంలో అపోలో హాస్పిటల్స్ తమ వంతు సాయం చేసేందుకు సిద్ధమైంది.
Also Read: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు
అపోలో హాస్పిటల్స్ ప్రకటనపై పీటీఐ రిపోర్ట్ చేసింది. త్వరలోనే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పలు ఫార్మా దిగ్గజాలు వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. 2 నుంచి 18 ఏళ్ల వారికి కోవిడ్19 వ్యాక్సిన్‌కు ఆమోదం రాగానే టీకాలు ఇవ్వడం మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలున్న చిన్నారులకు మొదటగా వ్యాక్సిన్ అందుతుంది.
Also read: చేపలతో తలనొప్పికి విరుగుడు... తరచూ తింటే మైగ్రేన్ మాయం
కరోనా టీకాలు తీసుకుందేకు కింది లక్షణాలు ఉండాలని ఓ జాబితాను విడుదల చేశారు. హెమటాలాజికల్, న్యూరోలాజికల్, గుండె సంబంధిత, కాలేయం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, రూమటిక్, క్యాన్సర్, రెస్పిరేటరీ, జెనిటారినరి సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు మొదటగా కరోనా టీకాలు ఇవ్వనున్నారు. చిన్నారులకు టీకాలపై ప్రభుత్వం తుది జాబితా విడుదలయ్యాక తమ తుది నిర్ణయం ఉంటుందని అపోలో మేనేజ్ మెంట్ పేర్కొంది.
Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
ఆ చిన్నారులకు మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. కరోనా వ్యాక్సినేషన్‌పై పోకస్ చేసినట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వెల్లడించారు. గతంలో విధించిన లాక్ డౌన్‌లు చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపాయన్నారు. జైడస్ కాడిల్లా రూపొందించిన జైకోవ్ డి వ్యాక్సిన్ 12 ఏళ్లు పైబడిన వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం పొందింది. కానీ వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానుంది.
2 నుంచి 18 ఏళ్ల వయసు వారికి ఇచ్చేందుకు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు తయారు చేసింది. కోవాగ్జిన్, జైకోవ్ డి వ్యాక్సిన్లు అపోలోలో అందుబాటులో ఉంటాయని ప్రతాప్ రెడ్డి తెలిపారు. మొదటగా యుద్ధప్రాతిపదికన కొన్ని అనారోగ్య లక్షణాలున్న చిన్నారులకు టీకాలు ఇచ్చి కరోనాపై పోరాటాన్ని ముమ్మరం చేద్దామన్నారు.
CM Jagan On Health Review : వైద్యం ఖర్చు రోగి ఖాతాకు బదిలీ - ఆరోగ్యశ్రీలో కీలక మార్పులకు సీఎం జగన్ ఆదేశం !
Male Fertility: అబ్బాయిలూ, మీరేం పోటుగాళ్లు కాదు- ఇలా చేయకుంటే జీవితంలో తండ్రి కాలేరు!
Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 11,793 మందికి వైరస్
Diabetes: వీటిని రోజూ తింటే చాలు, డయాబెటిస్ అదుపులో ఉండడం ఖాయం
Coronavirus Symptoms: ఈ రెండు ప్రాంతాల్లో వచ్చే నొప్పి కరోనా సోకిందని చెప్పే ముందస్తు సంకేతం కావచ్చు, తేలికగా తీసుకోవద్దు
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..
Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం
Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్