By: ABP Desam | Updated at : 29 Dec 2022 06:16 PM (IST)
ఆ దేశాల నుంచి రావాలంటే ముందుగానే కరోనా టెస్టు రిపోర్టు పంపాలి - కేంద్రం కొత్త ఆదేశాలు!
Corona Tests : జనవరి 1, 2023 నుండి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుండి వచ్చే విమాన ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణానికి ముందు వారు తమ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. కరోనా కేసులు విదేశాల్లో మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. రెండు సంవత్సరాల క్రితం ఎదుర్కొన్న పరిస్థితులు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో ముందు నుంచే నివారణ చర్యలు చేపట్టింది. పౌరులంతా మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రానున్న 40రోజులు భారత్ కు కీలకమని కేంద్రం ఇటీవలే వెల్లడించింది. జనవరిలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం తదితర ఏర్పాట్లపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది.
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్
చైనా సహా పలు దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఒక వేళ కేసులు ఉధృతమైతే.. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై మంగళవారం మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఈ మాక్ డ్రిల్‌లో ఆరోగ్య సౌకర్యాల లభ్యత, ఐసోలేషన్ బెడ్‌ల సామర్థ్యం, ఆక్సిజన్‌తో కూడిన పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్‌తో కూడిన పడకలు, వైద్యులు, నర్సులు, పారామెడిక్స్, ఆయుష్ వైద్యుల వాంఛనీయ లభ్యత వంటి ఇతర వనరులపై దృష్టి పెట్టింది.ఎలాంటి పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
RT-PCR test made mandatory for flyers coming from China, Hong Kong, Japan, South Korea, Singapore and Thailand from 1st January 2023. They will have to upload their reports on the Air Suvidha portal before travel: Union Health Minister Mansukh Mandaviya pic.twitter.com/I76Tbl3pNR
— ANI (@ANI) December 29, 2022
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ ఏర్పాట్లు
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ కేంద్రాలను మరో రెండు పెంచారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరీక్షించిన తరువాతనే బయటకు అనుమతిస్తున్నారు. ప్రయాణికులు వచ్చిన వారం రోజుల వరకు వారిని పర్యవేక్షిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి పరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైతే ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్సలు అందించేందుకు అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రోజువారీ కేసులు పెద్దగా నమోదు కావడం లేదు.
Heart Attacks: కోవిడ్ తర్వాత గుండె జబ్బులతోనే అత్యధిక మరణాలు - అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
Coronavirus: కోవిడ్ సోకిన 18 నెలల తర్వాత చనిపోయే ప్రమాదం? భయపెడుతున్న అధ్యయనం!
China Covid Deaths: షాకింగ్ - చైనాలో నెల రోజుల్లో 60 వేల కరోనా మరణాలు
China on Covid-19: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా, విదేశీ ప్రయాణికులకు నో క్వారంటైన్
మొండి కరోనా వైరస్ మెదడులో 8 నెలలు ఉండే అవకాశం - కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్