Omicron Cases: తెలంగాణలో విస్తరిస్తోన్న కొత్త వేరియంట్.. కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తాజాగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కు చేరింది.
తెలంగాణలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన 259 మందిని కోవిడ్ ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేశారు. వీరిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ నలుగురి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 9,381 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 63 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. వీరి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 22 మందికి ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. మరో నలుగురి ఫలితాలు ఇంకా రావాల్సిఉంది.
Also Read: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా... కొత్తగా 103 కేసులు, ఇద్దరు మృతి
కొత్తగా 182 కరోనా కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,353 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ నమూనాల్లో 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,80,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులిటెన్ లో ఈ వివరాలు వెల్లడించింది. గడచిన వ్యవధిలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు 4,017 మంది మరణించారు. కరోనా బారి నుంచి మంగళవారం 196 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇంకా 3,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్
తెలంగాణలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గక ముందే కొత్త వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 24 కేసులుంటే కొత్త కేసులతో ఆ సంఖ్య 38కు చేరింది. తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అధిస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
Also Read: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు