Corona Updates: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా... కొత్తగా 103 కేసులు, ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 103 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1358 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 28,670 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 103 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,483కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 175 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,236 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1358 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#COVIDUpdates: 22/12/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) December 22, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,182 పాజిటివ్ కేసు లకు గాను
*20,57,341 మంది డిశ్చార్జ్ కాగా
*14,483 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,358#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DYNdFl9NyM
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,077కి చేరింది. గడచిన 24 గంటల్లో 175 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,483కు చేరింది.
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2కు చేరుకుంది. విదేశాల నుంచి ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అనంతరం టెస్టులు నిర్వహించగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలినట్లు ఏపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 39 ఏళ్ల మహిళ డిసెంబర్ 10న కెన్యా నుంచి చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్టులో దిగిన మహిళ అక్కడి నుంచి ఏపీలోకి తిరుపతికి వచ్చారు. ఆమెకు నిర్వహించిన కరోనా టెస్టులలో డిసెంబర్ 12న పాజిటివ్ గా నిర్ధారించారు. ఏపీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించారు. ఏపీలో నమోదైన రెండో ఒమిక్రాన్ కేసు ఇది. ఇప్పటివరకూ విదేశాల నుంచి 49 మంది రాష్ట్రానికి రాగా, వారి కుటుంసభ్యులకు నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ టెస్టులలో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ సీసీఎంబీ సెంటర్‌కు శాంపిల్స్ పంపించి తదుపరి పరీక్షలు నిర్వహించగా.. వారికి ఒమిక్రాన్ నెగటివ్‌గా వచ్చినట్లు ప్రకటనలో తెలిపారు. అయితే కోవిడ్19 నిబంధనలు పాటించాలని, ప్రజలు ఒమిక్రాన్ గురించి భయపడవద్దని సూచించారు.
Also Read: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
దేశంలో కరోనా కేసులు
దేశంలో కొత్తగా 6,317 కరోనా కేసులు నమోదుకాగా 318 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 78,190కి చేరింది. 6,906 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 575 రోజుల కనిష్ఠానికి చేరింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు చేరింది. రికవరీ రేటు 98.4 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 213 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా 90 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాిన్ మరణం నమోదుకాలేదు. ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.
Also Read: Biryani: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
వ్యాక్సినేషన్..
దేశంలో టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 57,05,039 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,95,90,670కి చేరింది.
కీలక ఆదేశాలు..
దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కట్టడి కోసం వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. డెల్టా కంటే ఒమిక్రాన్ మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని కేంద్రం గుర్తు చేసింది. కేసుల సంఖ్య మరింత పెరిగితే కంటైన్‌మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి ఆంక్షలు అమలు చేయాలని సూచించింది.