Pfizer: కరోనా నియంత్రణలో మరో ముందడుగు.. ఫైజర్ నిర్ణయంతో 95 పేద దేశాలకు కొవిడ్ మాత్ర
కరోనా నియంత్రణకు మరో కీలక ముందడుగు పడింది. ఫైజర్ సంస్థ రెడీ చేసిన కరోనా నియంత్రణ మాత్రను ఇతర సంస్థలు కూడా తయారు చేయవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని టీకాలు వచ్చినప్పటికీ ఇంకా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. ఈ వైరస్‌తో కలిసి బతకడానికి ప్రపంచ జనాభా ఫిక్స్ అయిపోయింది. కేసులు పెరిగినప్పుడల్లా లాక్‌డౌన్లు, షట్ డౌన్లతో ప్రజలు, ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. అందుకే వీలైనంత వేగంగా ఈ వైరస్‌ను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు ఎంతగానో ఆలోచిస్తున్నాయి. అందుకే మందుల తయారీ సంస్థ ఫైజర్ మరో అడుగు ముందుకేసింది. ఆ సంస్థ తయారు చేసి యాంటి వైరల్ ట్యాబ్లెట్స్‌ను ఇతర కంపెనీల్లో కూడా తయారు చేయడానికి అంగీకరించింది.
ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న జెనీవాకు చెందిన మెడిసన్స్ పేటెంట్ పూల్ టీంతో ఫైజర్ సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. యాంటీ వైరల్ పాక్స్‌లోవిడ్ మాత్రలు తయారు చేయడానికి ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. మాత్రల తయారీకి ఎంపీపీకి లైసెన్స్ ఇచ్చినట్టు ఫైజర్ ప్రకటించింది.
ఎంపీపీ సంస్థ పేద దేశాలకు తక్కువ ధరలకే మందులు పంపిణీ చేస్తుంది. అందుకే ఈ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అభిప్రాయపడింది.
ఫైజర్, ఎంపీపీ చేసుకున్న ఈ ఒప్పందం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారు సగానికిపైగా జనాభాకు కోవిడ్ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. సుమారు 53శాతం మంది ఈ ఒప్పందం ద్వారా లబ్ధి పొందుతారు. ఈ మాత్రలపై రాయల్టీలు కూడా వదులుకుంటున్నట్టు ఫైజర్ ప్రకటించడంతో ఈ కోవిడ్ నియంత్రణ మాత్రలు 95 దేశాల్లో అత్యంత చౌకగా లభించనున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మాత్రలు మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఎంపీపీ ప్రయత్నిస్తున్నట్టు ఆ సంస్థ పాలసీ చీఫ్ తెలిపారు. ఫైజర్, ఎంపీపీ చేసుకున్న ఈ ఒప్పందంతో కరోనాను వీలైనంత త్వరగా తరిమికొట్టగలమంటున్నారు ప్రపంచ ఆరోగ్య నిపుణులు.
Also Read: ఆరోగ్యాన్ని వేయించుకుని తినేయకండి... వేపుడు వంటకాలతో వచ్చే రోగాలు ఇవే
Also Read: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Also Read: మూడ్ రావాలంటే మల్లెపూలే అక్కర్లేదు.. ఇవి కూడా మత్తెక్కిస్తాయ్!మూడ్ రావాలంటే మల్లెపూలే అక్కర్లేదు.. ఇవి కూడా మత్తెక్కిస్తాయ్!
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
Also Read: ఆ ఫీలింగ్స్ ఆడవారికే ఎక్కువట… వారిని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదట…
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి