Erotic Scents: మూడ్ రావాలంటే మల్లెపూలే అక్కర్లేదు.. ఇవి కూడా మత్తెక్కిస్తాయ్!
మత్తెక్కాలంటే.. మల్లెపూల వాసనే అక్కర్లేదు. మరికొన్ని పరిమళ ద్రవ్యాలతో కూడా మూడ్ వస్తుంది. అవేంటో చూసేయండి మరి.
మునగకాయలు తింటే మూడ్ వస్తుందని.. మల్లెపూలు వాసన మత్తెక్కిస్తాయని.. మీరు వినే ఉంటారు. మన సినిమాల్లో కూడా వీటినే ఎక్కువగా చూపిస్తారు. అంతే కాదు.. మన తెలుగింటి అమ్మాయిలకు కూడా మల్లెపూలంటే మహా మక్కువ. అవి పెట్టుకుంటే.. ప్రత్యేకంగా సెంట్ లేదా పెర్‌ఫ్యూమ్ ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు. అయితే, ఈ రోజుల్లో మల్లెపూలు కొనడమంటే అంత ఈజీగా కాదు. ముఖ్యంగా పట్టణాల్లో మల్లెపూల కోసం వెతికితే.. రాత్రి గడిచిపోతుంది. ఉన్న ఓపిక కూడా పోయి.. వెల్లకిలా పడుకోవల్సి వస్తుంది. అయితే, మీకు మల్లెపూలు దొరక్కపోతే వర్రీ కావక్కర్లేదు. ఎందుకంటే.. మల్లెపూల తరహాలోనే మత్తెక్కిస్తూ.. సెక్స్ కోరికలను రగిలించే పరిమళాలు ఇంకా చాలానే ఉన్నాయి. పైగా మల్లెపూల వాసన వల్ల కొంతమందికి తలనొప్పి వస్తుందని.. ముఖ్యం మల్లెపూల వాసనతో వచ్చే పెర్ఫ్యూమ్ అస్సలు వాడొద్దని సూచిస్తున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా వీటిని పరిమళ ద్రవ్యాలను ట్రై చేయండి.
దాల్చిన చెక్క: పసుపుతో కలిపిన దాల్చిన చెక్క వాసన నాడీ వ్యవస్థకు రక్త ప్రసరణను పెంచుతుంది. కాబట్టి దాల్చిన చెక్క నూనెను కొద్దిగా తీసుకుని గొంతు వద్ద, చెవుల వెనుక రాసుకోండి. ఆ వాసన మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది.
వెనీల్లా వాసన: ఈ వాసన ఇష్టంలేని వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి. శరీరంపై వెనీలా సువాసన శరీరాన్ని తేలికగా చేస్తుంది. మనస్సు మరింత తేలిగ్గా ఉంటుంది. సాధారణంగా పురుషుల సెక్స్ మూడ్‌ని పెంచేందుకు ఈ పెర్ఫ్యూమ్ ఉపయోగపడుతుంది.
పిప్పరమింట్: వెనీలా వాసన చూస్తే పురుషులకు మూడ్ ఎలా వస్తుందో.. అమ్మాయిలకు పిప్పరమెంటు వాసన చూస్తే కోరికలు కలుగుతాయట. ఈ సువాసన మహిళల్లో ఉద్రేకాన్ని పెంచుతుంది. సెక్స్ సమయంలో భావప్రాప్తి పొందడానికి ఈ సువాసన సహకరిస్తుంది.
చందనం: గంధపు నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలో సెక్స్ సెన్స్ పెరుగుతుంది. లైంగిక కోరికలను ప్రేరేపిస్తుంది. అందుకే మన పెద్దలు శోభనం (తొలిరాత్రి) రోజు వధువరుల బుగ్గలకు గంధాన్ని రాస్తారు.
లావెండర్: సెక్స్ సమయంలో కొంతమందికి దడ వస్తుంది. అది పోవాలంటే.. కనురెప్పల మీద కొద్దిగా లావెండర్ నూనె రాయాలి. అయితే, ఆయిల్ మోతాదు ఎక్కువ కాకూడదు. లావెండర్ వాసన మూడ్ ప్రేరేపించి.. సెక్స్ డ్రైవ్ సాఫీగా సాగేలా చూస్తుంది.
Also Read: మీరు తలగడ ఉతికి ఎన్నాళ్లవుతుంది? ఈ నిజాలు తెలిస్తే షాకవ్వడం ఖాయం!
గులాబీలు: మల్లెపూల కంటే గులాబీ వాసన వల్లే సెక్స్ డ్రైవ్ మరింత ఎక్కువ సేపు కొనసాగుతుందట. అందుకే ప్రియురాలికి పుష్పగుచ్ఛం ఇచ్చినప్పుడు గులాబీలను సిఫార్సు చేస్తారు. గులాబీ రేకను మీ వేళ్లతో తేలికగా పిండి.. శరీరానికి రాసుకోండి. ఈ సహజసిద్ధమైన సువాసన శరీర చెమటతో మిళితమై మీ భాగస్వామిలో కోరికలను రగిలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రాత్రే వీటిలో ఒకటి ట్రై చేయండి.
Also Read: సెక్స్ పై ఇంట్రస్ట్ తగ్గే వయసేది? ఆ థాట్స్ ఎప్పటి వరకు ఉంటాయి?
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి