సెక్స్ పై ఇంట్రస్ట్ తగ్గే వయసేది? ఆ థాట్స్ ఎప్పటి వరకు ఉంటాయి?
రెగ్యూలర్ గా చేసే పనులపై చిరాకు రావడం అనేది సాధారణం. కానీ శృంగారంపై మాత్రం అలా రాదు. అయితే సెక్స్ పై ఇలా ఎన్ని ఏళ్ల వరకు ఉంటుంది?
ఒక్కోసారి ఎక్కడికో ఆలోచిస్తాం. అది అవసరమైనా.. అనవసరమైనా.. తెలుసుకోవాలనే ఓ ఇంట్రస్ట్ మాత్రం ఉంటుంది. సెక్స్ విషయంపై ఎంతమంది చెప్పినా.. ఏదో ఓ అనుమానం ఉంటూనే ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత.. శృంగారం అనేది.. రెగ్యూలర్ గా చేసేదే. అయినా.. ఓ వయసు వచ్చాక ఎలా అనే ఆలోచన చాలా మందికే వస్తుంది. అప్పుడు శృంగారం మీద బోర్ కొడుతుందా? ఆసక్తి తగ్గుతుందా?
ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే? సెక్స్ మీద ఆసక్తి తగ్గడం అనేది ఉండదంటున్నారు. స్త్రీ, పురుషుల్లోనూ అలానే ఉంటుంది. అయితే ఓ వయసు వచ్చాక.. హార్మోన్స్ ప్రభావంతో సెక్స్ లో పాల్గొనలేకపోవచ్చేమో గానీ.. సెక్సువల్ థాట్స్ మాత్రం ఉంటాయని అంటున్నారు. ఇంకో విషయం తెలుసా? సెక్స్ పై ఆసక్తి.. తగ్గకపోవడానికి మరో కారణం.. మానవ శరీరంలో రిలీజ్ అయ్యే.. ఫీల్ గుడ్ హార్మోన్స్ కారణం అని చెబుతున్నారు.
మనిషి దేనినైనా.. వద్దు అనుకుని.. బలంగా ఆ విషయాన్ని మానసికంగా ఎదుర్కొంటే మాత్రమే.. దానికి దూరంగా ఉంటాడు. శృంగారం విషయంలోనూ అంతేనట. మానసికంగా నియంత్రించుకుంటే.. ఆ ఆసక్తి తగ్గుతుందని చెబుతున్నారు. వయసులో ఉన్నప్పుడు మాత్రంమ.. రోజుకు మూడు లేదా.. అంతకంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటారని .. ఆ తర్వాత అది క్రమంగా తగ్గుతూ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సెక్స్ వల్ల కలిగే అనుభూతిని పొందాలని అనుకునే వారు మాత్రం.. నెల లేదా రెండునెలలకు ఓసారైనా సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు. సంపాదన, బాధ్యతలు.. ఇతర కారణాలతో.. మానసిక ఒత్తిడి.. శృంగారంపై ప్రభావం చూపిస్తుందట.
వయస్సు దాటిన కొంతమందిలో సెక్స్ అనేది మానసిక ఒత్తిడి కారణంగా తగ్గుతుంది. అనారోగ్య సమస్యల కారణంగానూ గతంలో ఉన్నంతగా ఇంట్రస్ట్ ఉండదు. 35-40ఏళ్లు పైబడిన వారు దాంపత్య జీవితం, పిల్లలు, కుటుంబంతో బిజీబిజీగా ఉంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, ఆర్థికంగా సెటిల్ కావాలన్న ఆలోచనలో ఉంటారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. కొంతమంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. శృంగారం విషయంలో వయసు మీద పడుతున్నా.. యవ్వనంలో ఉన్నట్టే ఉంటారట.
Also Read: Omega-3 fats: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Also Read: Longevity: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
Also Read: Alcohol: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...