COVID Men Infertility : కరోనా చివరికి మగతనానికీ సవాల్ విసిరిందట ! వైరస్ బారిన పడ్డ మగవాళ్లందరికీ బ్యాడ్ న్యూస్
కరోనా వైరస్ సోకిన మగవాళ్లలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిందని ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడయింది. ఆ పరిశోధనలో ఇంకా ఏం తేలిందంటే ?
కరోనా ( Corona ) ( నుంచి వేగంగా కోలుకున్నాం..మాకు చాలా రోగ నిరోధక శక్తి ఉందని ఫీలవుతున్నారా.. ? అయితేముందుగా మీరీ విషయం తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే కోవిడ్ Covid ) బారిన పడి కోలుకున్న వాళ్లలో చాలా చాలా సమస్యలు ఉన్నాయన్న పరిశోధనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పురుషుల పునరుత్పత్తి వ్యవస్థపై ( Male Fertility ) కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతోందట. ఈ విషయం ఐఐటీ బాంబే ( IIT Bombay ) శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయింది. ఎసిఎస్ ఒమేగా ( ACS Omega ) పత్రిక ఈ వివరాలను అందించింది.
బాబు చిట్టి! లిప్‌లాక్‌లు, హగ్‌లు వద్దు, కలిసి పడుకోవద్దు- అక్కడ వింత ఆంక్షలు!
పురుషుల పునరుత్పత్తి అవయవాల్లో కరోనా వైరస్ ( Virus ) ఉనికి ఉంటున్నట్టు ఇటీవల కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకే ఈ కరోనా ఎమైనా సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుందా అని పరిశోధన చేశారు. ఐఐటి-బాంబే, ముంబయిలోని జస్‌లోక్ ఆసుపత్రి-పరిశోధన కేంద్రం నిపుణులు పరిశోధనలు చేపట్టారు. ఇందులో కోవిడ్ నుంచి కోలుకున్న 17 మంది, ఇన్‌ఫెక్షన్ సోకని సంపూర్ణ ఆరోగ్యవంతులైన మరో 10 మంది పురుషుల వీర్యంలోని ప్రొటీన్ల స్థాయిలను విశ్లేషించారు. ఈ పరిశోధనలో... ఇన్‌ఫెక్షన్ కారణంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలే కనిపించినా... వారి సంతానోత్పత్తిని మాత్రం గట్టిగానే దెబ్బతీస్తున్నట్టు కనుగొన్నారు.
కరోనా మాట దేవుడెరుగు- అక్కడ ఆకలితో చనిపోయేలా ఉన్నారు!
కోవిడ్ బాధితులైన మగవారిలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటోంది. వాటి చలనశీలత కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నట్లుగా గుర్తించారు. ఆకారంలోనూ మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. పునరుత్పత్తికి దోహదపడే వీర్యంలోని 27 ప్రొటీన్ల స్థాయిలు పెరగ్గా.. 21 ప్రొటీన్ల స్థాయులు తగ్గాయి. ని చెప్పారు. ముఖ్యంగా సెమెనోజెలిన్-1, ప్రొసాపోసిన్ ప్రొటీన్లు ఉండాల్సిన దానిలో సగం కంటే తక్కువగానే ఉంటున్నట్టు గుర్తించామని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత లోతుగా పరిశోధన చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి
కరోనా బారిన పడి కోలుకున్న వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న వారికి కూడా కరోనా కారణంగా ఏర్పడుతున్న బ్లాక్సే కారణం అని చెబుతున్నారు. అయితే కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో ఇతమిత్థంగా ఇలాంటి సమస్యలు వస్తాయని ఎవరూ చెప్పలేకపోతున్నారు. అనేక రకాల వ్యవస్థలపై కరోనా వైరస్ దాడి చేస్తోందని మాత్రం తరచూ వెల్లడవుతోంది .