Coronavirus India Update: దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. కేరళలోనే 65 శాతం కొవిడ్19 కేసులు.. పలు రాష్ట్రాలు అలర్ట్
నిన్న ఒక్కరోజులో 648 మంది కొవిడ్ మహమ్మారితో పోరాడుతూ మరణించారు. సగానికి పైగా కేసులు కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
దేశంలో కరోనా కేసులు రెండు మూడు రోజులు తగ్గినట్లు కనిపించినా మరోసారి పాజిటివ్ కేసులు భారీగానే నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,953 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో కరోనా మరణాలు నిన్నటితో పోల్చితే అధికంగా నమోదయ్యాయి. సగానికి పైగా తాజా కేసులు కేవలం ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి.
నిన్న ఒక్కరోజులో 648 మంది కొవిడ్ మహమ్మారితో పోరాడుతూ మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,35,758 (4 లక్షల 35 వేల 758)కి చేరింది. దేశంలో మొత్తం కరోనా కేసులు 3,25,12,366 (3 కోట్ల 25 లక్షల 12 వేల 366)కు చేరుకున్నాయి. మంగళవారం నాడు 34,169 మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ కాగా, కోలుకున్న వారి సంఖ్య 3,17,54,281 (3 కోట్ల 17 లక్షల 54 వేల 281)కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
Also Read: Salt for Vastu: ఉప్పుతో వాస్తు దోషాలను తొలగించవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
దేశ వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటివరకూ 59 కోట్ల 55 లక్షల 4 వేల 593 డోసుల కరోనా టీకాలు పంపిణీ జరిగింది. ఇందులో గడిచిన 24 గంటల్లో 61 లక్షల 90 వేల 930 డోసుల వ్యాక్సిన్‌ను ప్రజలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ, కఠిన కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Of 37,593 new #COVID19 cases and 648 deaths reported in India in the last 24 hours, Kerala recorded 24,296 COVID positive cases and 173 deaths yesterday.
— ANI (@ANI) August 25, 2021
గుబులురేపుతోన్న కేరళ
దేశ వ్యాప్తంగా గత మూడు నెలలుగా నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వస్తున్నాయి. తాజా కేసులు 37,593 కొవిడ్ కేసులలో 65 శాతం కేరళలో నమోదయ్యాయి. 24,296 కరోనా కేసులు, 173 మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే సంభవించడం వైద్య శాఖ నిపులను, కేరళ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 ఆహారాలను తప్పక తీసుకోవాలి